News March 10, 2025

మిర్యాలగూడ: ఆరేళ్లుగా కోర్టులోనే ప్రణయ్ హత్య కేసు విచారణ

image

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసు దాదాపు ఆరేళ్లుగా <<15708073>>కోర్టులోనే విచారణ<<>> కొనసాగుతోంది.ఎట్టకేలకు ఈరోజు తుది తీర్పు రానుంది. కాగా A1గా ఉన్న మారుతీరావు ఆత్మహత్య చేసుకోగా ప్రణయ్‌ను చంపిన బిహార్ వాసి సుభాష్ శర్మ A2గా, అజ్గర్ అలీ A3గా,అబ్దుల్లా బారీ A4గా, MA కరీం A5గా, మారుతీరావు తమ్ముడు శ్రావణ్ A6గా, డ్రైవర్ శివ A7గా, నిజాం A8గా ఉన్నారు. ఈరోజు నిందితులకు కోర్టు శిక్ష ఖరారు చేయనుంది.

Similar News

News November 2, 2025

ప్రయాణాల్లో వాంతులవుతున్నాయా?

image

ప్ర‌యాణాల్లో వాంతులు అవ‌డం అనేది సాధార‌ణంగా చాలా మంది ఎదుర్కొనే స‌మ‌స్య. వికారంగా అనిపించ‌డం, త‌ల తిర‌గ‌డం, పొట్ట‌లో అసౌకర్యంగా ఉండడం ఇవ‌న్నీ మోష‌న్ సిక్‌నెస్ ల‌క్ష‌ణాలు. దీన్ని తగ్గించాలంటే అల్లం రసం, హెర్బల్ టీ వంటివి తాగాలి. శ్వాస వ్యాయామాలు చేయాలి. నిమ్మకాయ వాసన చూసినా వికారం తగ్గుతుంది. అలాగే ప్రయాణానికి ముందు తేలిగ్గా జీర్ణ‌మ‌య్యే ఆహారం తీసుకోవాలి. హెవీ ఫుడ్స్‌ సమస్యను మరింత పెంచుతాయి.

News November 2, 2025

కీలక వికెట్లు కోల్పోయిన భారత్

image

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టీ20లో భారత్ కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (25), గిల్ (15), కెప్టెన్ సూర్య (24) ఔటయ్యారు. తిలక్ వర్మ, అక్షర్ పటేల్ క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం టీమ్ ఇండియా స్కోర్ 8 ఓవర్లలో 82/3గా ఉంది. సూర్య సేన విజయానికి మరో 72 బంతుల్లో 105 రన్స్ అవసరం. మరి ఈ మ్యాచులో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.

News November 2, 2025

సిరిసిల్ల: రేపటి నుంచి సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్ళు

image

పత్తి పంటను సోమవారం నుండి కొనుగోలు చేసేందుకు సీసీఐ సిద్ధమైంది. వేములవాడ అర్బన్, రూరల్, చందుర్తి, బోయినపల్లి, కోనరావుపేట, రుద్రంగి మండలాలలో సుమారు మూడు లక్షల పైచిలుకు క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. నాంపల్లి, సంకేపల్లి, సుద్దాల లోని జిన్నింగ్ మిల్లులలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. పత్తి విక్రయించే రైతులు ముందుగా స్లాట్ బుకింగ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.