News March 10, 2025
మిర్యాలగూడ: ఆరేళ్లుగా కోర్టులోనే ప్రణయ్ హత్య కేసు విచారణ

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసు దాదాపు ఆరేళ్లుగా <<15708073>>కోర్టులోనే విచారణ<<>> కొనసాగుతోంది.ఎట్టకేలకు ఈరోజు తుది తీర్పు రానుంది. కాగా A1గా ఉన్న మారుతీరావు ఆత్మహత్య చేసుకోగా ప్రణయ్‌ను చంపిన బిహార్ వాసి సుభాష్ శర్మ A2గా, అజ్గర్ అలీ A3గా,అబ్దుల్లా బారీ A4గా, MA కరీం A5గా, మారుతీరావు తమ్ముడు శ్రావణ్ A6గా, డ్రైవర్ శివ A7గా, నిజాం A8గా ఉన్నారు. ఈరోజు నిందితులకు కోర్టు శిక్ష ఖరారు చేయనుంది.
Similar News
News January 22, 2026
బొత్స వ్యాఖ్యలు హాస్యాస్పదం: MLA కిమిడి

ఉపాధి హామీ పథకం విషయంలో బొత్స సత్యనారాయణ చేస్తున్న ఆరోపణలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు అన్నారు. విజయనగరంలో ఆయన మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకంలో అవకతవకలు జరుగుతున్నాయని బొత్స చెప్పడం హాస్యాస్పదమన్నారు. ప్రస్తుతం వేతనదారులకు డబ్బులు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయని, ఆరోపణలు చేయడమే తప్ప జిల్లాకు మీ వల్ల జరిగిన మేలేమిటో చెప్పాలన్నారు.
News January 22, 2026
నందిగామలో పర్యటించిన కలెక్టర్ లక్ష్మీశ

నందిగామ మండలం కంచలలో గురువారం కలెక్టర్ లక్ష్మీశ పర్యటించారు. గ్రామంలో జరుగుతున్న ఎన్‌ఆర్‌ఈజీఎస్ పనులను పరిశీలించి కూలీలతో మాట్లాడారు. హార్టికల్చర్ శాఖలో భాగంగా మునగ, మామిడి తోటలను పరిశీలించారు. పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా రూ. 20 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. కొత్త కంచల గ్రామంలో రైతులు ఏర్పాటు చేసిన గోకులం షెడ్లను పరిశీలించారు.
News January 22, 2026
అధిక స్క్రీన్ టైమ్‌తో పిల్లల హార్ట్‌కు రిస్క్

పిల్లలు ఫోన్లు, TVలకు గంటల తరబడి అతుక్కుపోవడం వల్ల వారి గుండె ఆరోగ్యం దెబ్బతింటోందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్‌లో పబ్లిష్ అయిన తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. ప్రతి అదనపు గంట స్క్రీన్ టైమ్ BP, కొలెస్ట్రాల్, షుగర్ లెవెల్స్‌ను పెంచి గుండెకు ముప్పును తలపెడుతోంది. నిద్ర తక్కువైతే ఈ ప్రమాదం మరీ ఎక్కువ. మొబైల్ వాడకాన్ని తగ్గించి పిల్లలకు తగినంత నిద్ర, శారీరక శ్రమ ఉండేలా చూడాలని స్టడీ సూచించింది.


