News February 26, 2026

మిర్యాలగూడ: ఐదుగురు నకిలీ డాక్టర్ల అరెస్ట్.. ఐదు కంటి ఆస్పత్రులపై చర్యలు

image

మిర్యాలగూడలో అర్హత లేకుండా డాక్టర్లుగా చలామణి అవుతున్న ఐదుగురు నకిలీ వైద్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదు కంటి ఆసుపత్రులలో ఎలాంటి మెడికల్ సర్టిఫికెట్లు లేకుండా వీరు చికిత్స అందిస్తున్నట్లు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తనిఖీల్లో తేలింది. బాధితులు, కౌన్సిల్ సభ్యుల ఫిర్యాదు మేరకు గాలింపు చేపట్టిన పోలీసులు, నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. పూర్తి వివరాలను డీఎస్పీ రాజశేఖర్ రాజు వెల్లడించారు.

Similar News

News April 14, 2026

ములుగు: ఇంటర్ ఫలితాల్లో టాపర్లుగా అక్కా, తమ్ముడు

image

ఏటూరునాగారంలో అక్కా-తమ్ముడు టాపర్లుగా నిలిచి అందరి ప్రశంసలు పొందారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం ఎంపీసీ చదువుతున్న పెండ్యాల చైత్రశ్రీ 982 మార్కులు సాధించి కళాశాల, మండల టాపర్‌గా నిలిచింది. అదే కళాశాలలో ప్రథమ సంవత్సరం ఎంపీసీ చదువుతున్న ఆమె తమ్ముడు చైతన్య 451 మార్కులు సాధించి కళాశాల టాపర్‌గా నిలిచాడు. ఒకే కళాశాలలో చదువుతూ ఇద్దరూ టాపర్లుగా నిలవడం విశేషం.

News April 14, 2026

సాగర్ ఎడమ కాల్వకు నిలిచిన సాగునీరు

image

నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు సాగునీటి విడుదలను అధికారులు ఇవాళ ఉదయం నిలిపివేశారు. సాగు అవసరాలు తీరడం, పంట కోతలు ప్రారంభం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరిగేషన్ శాఖ తెలిపింది. ప్రస్తుతం డ్యామ్‌లో 312 టీఎంసీలకు గాను ప్రస్తుతం 163 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎండాకాలం దృష్ట్యా తగ్గుతున్న నీటి నిలువలను కేవలం తాగునీటి అవసరాలకే వినియోగించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

News April 14, 2026

GNT: రీ-సర్వే సమస్యల పరిష్కారానికి చర్యలు

image

భూముల రీ-సర్వేలో వచ్చిన లోపాలను సరిచేయడానికి అధికారులు చర్యలు ప్రారంభించారు. గురువారం రైతులకు మ్యుటేషన్, సబ్‌డివిజన్‌కు అవకాశం కల్పించారు. జూన్ 30 వరకు రాయితీ ఫీజుతో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. సాధారణంగా రూ.550 ఉండే ఫీజు, గడువులో రూ. 50కే పరిమితం చేశారు. రీ-సర్వేలో ఎల్పీఎం నంబర్లు, భూమి వివరాలు తారుమారవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యల పరిష్కారానికి సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి.