News February 26, 2026
మిర్యాలగూడ: ఐదుగురు నకిలీ డాక్టర్ల అరెస్ట్.. ఐదు కంటి ఆస్పత్రులపై చర్యలు

మిర్యాలగూడలో అర్హత లేకుండా డాక్టర్లుగా చలామణి అవుతున్న ఐదుగురు నకిలీ వైద్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదు కంటి ఆసుపత్రులలో ఎలాంటి మెడికల్ సర్టిఫికెట్లు లేకుండా వీరు చికిత్స అందిస్తున్నట్లు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తనిఖీల్లో తేలింది. బాధితులు, కౌన్సిల్ సభ్యుల ఫిర్యాదు మేరకు గాలింపు చేపట్టిన పోలీసులు, నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. పూర్తి వివరాలను డీఎస్పీ రాజశేఖర్ రాజు వెల్లడించారు.
Similar News
News April 16, 2026
GNT: కోర్టులో దురుసు ప్రవర్తన.. యువతికి ఫైన్

గుంటూరు హత్య కేసు ట్రయల్‌లో సాక్షిగా హాజరైన పావని కోర్టులో స్టేట్‌మెంట్ ఇవ్వకుండా బిగ్గరగా కేకలు వేస్తూ జడ్జి, పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సూచనలను పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో కోర్టు ప్రొసీడింగ్స్‌కు అంతరాయం కలిగించడంతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. సాయి కళ్యాణ్ చక్రవర్తి రూ. 200 ఫైన్ విధించారు. చెల్లించకపోతే 15 రోజుల సాధారణ శిక్ష అనుభవించాలని ఆదేశించారు.
News April 16, 2026
మద్దతు ధరకే ధాన్యం కొనుగోలు: నెల్లూరు జేసీ

నెల్లూరు జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫీగా సాగుతోందని, రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వ కేంద్రాల్లోనే అమ్ముకోవాలని జేసీ మొగిలి వెంకటేశ్వర్లు సూచించారు. ధాన్యం అమ్మి మద్దతు ధర పొందాలని, సమస్యలు ఉంటే 1967, 85208 79979 నంబర్లను సంప్రదించాలని కోరారు. విక్రయించిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు.
News April 16, 2026
ఇంటికే మందులు.. కాసులు ఇస్తే కౌన్సిలింగ్ అవసరం లేదు

హెచ్ఐవి బాధితులు తప్పనిసరిగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ఏఆర్‌టి సెంటర్లకు వెళ్లి ప్రతి నెల మందులు తీసుకోవాలి. మందులతో పాటుగా ప్రతి బాధితునికి కౌన్సిలింగ్ ఇవ్వాలి. అయితే కొందరు మాత్రం కాసులు ఇస్తే ఇంటికే పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. కౌన్సిలింగ్ కూడా ఇచ్చినట్లు రికార్డులలో నమోదు చేస్తున్నారు. ఇలా ఏఆర్‌టీ సెంటర్లలో కాసులదే పై చేయిగా మారుతుంది


