News March 10, 2025
మిర్యాలగూడ: కోర్టు తీర్పు.. పేరెంట్స్, అమృత భావోద్వేగం

మిర్యాలగూడ <<15710555>>ప్రణయ్ హత్య<<>> కేసులో కోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఇప్పటికే మారుతీరావు ఆత్మహత్య చేసుకోగా A2 సుభాష్ శర్మకు ఉరిశిక్ష, A3 అజ్గర్ అలీ, A4 అబ్దుల్లా బారీ, A5 కరీం, A6 శ్రావణ్, A7 శివ, A8 నిజాంకు యావజ్జీవ శిక్షను కోర్టు విధించింది. కాగా తీర్పు అనంతరం మిర్యాలగూడలోని ప్రణయ్ సమాధి వద్ద పూలు వేసి పలువురు నివాళులర్పించారు. కాగా ప్రణయ్ తల్లిదండ్రులు, భార్య అమృత కన్నీటి పర్యంతమయ్యారు.
Similar News
News November 5, 2025
NLG: ఇంటర్ కళాశాలపై నిఘా…..!

జిల్లాలో సర్కారు, ప్రైవేట్ జూనియర్ కళాశాలలపై ఇంటర్ బోర్డు నిఘా పెట్టింది. సర్కారు కళాశాలల్లో ఇప్పటికే ప్రక్షాళన చేసిన ప్రభుత్వం ఆచరణలో క్షేత్రస్థాయి పరిస్థితుల అధ్యయనానికి చర్యలు చేపట్టింది. దీంతో పాటు వేలల్లో ఫీజులు చెల్లిస్తున్న ప్రైవేట్ కళాశాలల్లో విద్యాబోధన, మౌలిక వసతులు తదితర అంశాలపై తనిఖీలు చేపడుతున్నారు. జిల్లాలోని 140 కళాశాలలకు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు.
News November 5, 2025
శివ నామస్మరణతో మారుమోగుతున్న ఆలయాలు

నల్గొండ జిల్లాలో కార్తీక మాసం కొనసాగుతుంది. దీంతో ఈ మాసంలో ప్రతి రోజు అధిక సంఖ్యలో భక్తులు దేవాలయాలకు భక్తులు తరలివెళ్తున్నారు. జిల్లాలో చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామీ, పానగల్ ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానంతో పాటు వివిధ ఆలయాలకు భక్తులు ఉదయమే పెద్ద ఎత్తున చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ ఆలయాలు దీపాల కాంతులతో, శివనామస్మరణతో మార్మోగుతున్నాయి.
News November 5, 2025
NLG: 4400 క్వింటాళ్ల పత్తి కొనుగోలు

నల్గొండ జిల్లాలో 23 జిన్నింగ్ మిల్లుల పరిధిలో L-1 కింద ఉన్న 9 కేంద్రాల్లో పత్తి కొనుగోళ్లు ప్రారంభించినట్లు మార్కెటింగ్ శాఖ ఏడి ఛాయాదేవి తెలిపారు. ఇప్పటివరకు 4400 క్వింటాళ్లు కొనుగోలు చేసినట్లు చెప్పారు. సీసీఐ నిబంధనల ప్రకారం 8 నుంచి 12% తేమ ఉండడంతో పాటు కపాస్ కిసాన్ అనే యాప్లో స్లాట్ బుక్ చేసుకున్న రైతులు మాత్రమే స్లాట్ ఆధారంగా పత్తిని కొనుగోలు కేంద్రాల్లోకి తీసుకురావాలని సూచించారు.


