News October 9, 2024

మిర్యాలగూడ: టీచర్ అయిన రిక్షావాలా కొడుకు

image

మిర్యాలగూడ పట్టణం రవీంద్రనగర్ కాలనీకి చెందిన ముడావత్ గణేశ్ డీఎస్సీ – 2024 ఫలితాల్లో ఎస్టీ విభాగంలో ఎస్జీటీ ఉద్యోగం సాధించాడు. తండ్రి మూడావత్ పంతులు రిక్షా తొక్కుతూ, తల్లి పండ్లు అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వీరికి నలుగురు అమ్మాయిలు. ఇద్దరు అబ్బాయిలు సంతానం. చిన్న కుమారుడు గణేశ్ ప్రభుత్వ ఉద్యోగం సాధించడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News November 2, 2024

సాగర్ అభివృద్ధికి చర్యలు : మంత్రి జూపల్లి

image

నాగార్జునసాగర్, బుద్ధవనం పరిసర ప్రాంతాలలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో స్టార్ హోటల్ నిర్మాణంతో పాటు, వాటర్ స్పోర్ట్స్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. శుక్రవారం అయన బుద్ధవనం పరిసర ప్రాంతాలను శ్రీ రామచంద్ర మిషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కమలేష్ డి.పాటిల్ తో కలిసి పరిశీలించారు. సాగర్ ను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

News November 1, 2024

కోదాడ: నీ డీపీ బాగుంది.. ఉద్యోగినికి లైంగిక వేధింపులు

image

కోదాడలో ఉద్యోగినిపై లైంగిక వేధింపుల వ్యవహారం వెలుగుచూసింది. బాధిత మహిళ వివరాలిలా.. ఇటీవల ఓ వ్యక్తి కాల్ చేసి తాను ఓ రాజకీయ నాయకుడి పీఏ అంటూ పరిచయం చేసుకున్నాడు. ‘డీపీ బాగుంది.. వస్తావా’ అంటూ అసభ్యంగా ప్రవర్తించాడు. డబ్బు ఎంతైనా ఇస్తా లొంగి పోవాలంటూ ఇబ్బంది పెట్టాడంటూ బాధితురాలు వాపోయింది. నిందితుడిపై షీ టీం, సూర్యాపేట డీఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు చెప్పింది. 

News November 1, 2024

సాగర్ కాలువలో పడి వ్యక్తి మృతి

image

మిర్యాలగూడ మండలం తక్కెళ్ళపాడు గ్రామానికి చెందిన హరికృష్ణ (32) సాగర్ ఎడమ కాలువలో పడి మృతి చెందాడు. గురువారం ఉదయం ఉద్యోగానికి వెళ్లిన హరికృష్ణ కాలువలో విగతజీవిగా పడి ఉన్నారు. భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతుండడంతో హరికృష్ణ మృతి పట్ల కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.