News March 10, 2025
మిర్యాలగూడ: ప్రణయ్ హత్య కేసు.. JUSTICE SERVED

ఆరేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన <<15709750>>ప్రణయ్ హత్య<<>> కేసుకు ఎట్టకేలకు తెరపడింది. ఈరోజు NLG కోర్టు ప్రధాన నిందితుడికి ఉరిశిక్ష, మిగతా వారికి యావజ్జీవ శిక్ష విధించింది. ప్రణయ్, అమృత పరిచయం నుంచి వారి ప్రేమ పెళ్లి.. గొడవలు.. కేసులు.. ప్రణయ్ హత్య.. మారుతీరావు సూసైడ్.. వాదనలు.. విచారణలు.. నేటి కోర్టు తీర్పు వరకు ప్రతి సందర్భం చర్చనీయాంశం అవగా ఫైనల్గా JUSTICE SERVED అని పలువురు అంటున్నారు.
Similar News
News December 3, 2025
MGU బీటెక్ మొదటి సెమిస్టర్ విద్యార్థులకు అలెర్ట్

మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలో బీటెక్ మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును డిసెంబర్ 8 వరకు ఎటువంటి అపరాధ రుసుము లేకుండా పొడిగించినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డా.ఉపేందర్ రెడ్డి ప్రకటించారు. రూ.200 అపరాధ రుసుముతో డిసెంబర్ 10వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. మొదటి సెమిస్టర్కు సంబంధించిన పరీక్షల టైమ్ టేబుల్ను త్వరలో విడుదల చేస్తామన్నారు.
News December 3, 2025
డిసెంబర్ 03: చరిత్రలో ఈ రోజు

1884: భారత తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ జననం (ఫొటోలో)
1889: స్వాతంత్ర్యోద్యమకారుడు ఖుదీరాం బోస్ జననం
1971: భారత్, పాకిస్థాన్ మూడో యుద్ధం ప్రారంభం
1979: హాకీ ఆటగాడు ధ్యాన్ చంద్ మరణం
2009: తెలంగాణ అమరవీరుడు కాసోజు శ్రీకాంతచారి మరణం
2011: హిందీ నటుడు దేవానంద్ మరణం
* అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం
News December 3, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.


