News March 10, 2025

మిర్యాలగూడ: ప్రణయ్ MURDER.. అసలేం జరిగింది?

image

> టెన్త్ నుంచి ప్రణయ్, అమృత ఫ్రెండ్స్
> 2018 JANలో HYDలో వారి ప్రేమ పెళ్లి
> విషయం తెలిసి 2కుటుంబాల్లో గొడవలు.. PSలో ఫిర్యాదు
> 2018 SEP 14న కులాంతర వివాహం తట్టుకోలేక ప్రణయ్‌ను దుండగుడితో <<15707820>>చంపించిన<<>> మారుతీరావు
> ప్రణయ్ తండ్రి ఫిర్యాదుతో 8మందిపై కేసు నమోదు
> 2019 JUN 12న అప్పటి SPరంగనాథ్ ఆధ్వర్యంలో 1600పేజీల ఛార్జిషీట్ రూపొందించిన పోలీసులు
> 2020 మార్చిలో మారుతీరావు సూసైడ్
> నేడు తుది తీర్పు

Similar News

News November 27, 2025

KNR: ఉత్సాహంగా దివ్యాంగుల ఆటల పోటీలు

image

మహిళలు, పిల్లలు, వికలాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగుల జిల్లా స్థాయి ఆటల పోటీలు కరీంనగర్ లోని డా.బి.ఆర్.అంబేద్కర్ స్టేడియంలో ఘనంగా జరిగాయి. కలెక్టర్ పమేలా సత్పతి హాజరై పలు ఆటల పోటీలను జెండా ఊపి ప్రారంభించారు. గెలుపొందిన వారికి మెడల్స్ అందజేశారు. చెస్, క్యారం, రన్నింగ్, షార్ట్ పుట్, జావలిన్ త్రో వంటి పోటీల్లో విభాగాల వారీగా అంధులు, బధిరులు, శారీరక, మానసిక దివ్యాంగులు తమ ప్రతిభను చాటారు.

News November 27, 2025

మహబూబాబాద్‌లో కొనసాగుతున్న రోడ్డు వెడల్పు పనులు

image

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బస్టాండ్ దగ్గర నుంచి కేశంపురం వెళ్లేదారి వెడల్పు, సుందరరీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే రోడ్డు వెడల్పు పనులు పూర్తయి రోడ్డు మధ్యలో డివైడర్‌ను కూడా నిర్మించగా, ఇప్పుడు వెడల్పు చేసిన రహదారిని తారు రోడ్డుగా మార్చే పునరుద్ధరణ పనులు చేపట్టాల్సి ఉంది. వాహనదారులు కొంతమేరకు ఇబ్బంది పడినప్పటికీ శాశ్వత పరిష్కారం దొరుకుతుందని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

News November 27, 2025

రాజధాని రైతులతో చంద్రబాబు సమావేశం

image

AP: అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు సమావేశం అయ్యారు. ఇందులో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, జిల్లా కలెక్టర్ అన్సారియా పాల్గొన్నారు. గ్రామ కంఠాలు, జరీబు, అసైన్డ్, లంక భూములు, వీధిపోటు సమస్యలు, రాజధాని గ్రామాల్లో వసతులు, ఉద్యోగాల కల్పనపై చర్చించారు.