News March 14, 2025
మిర్యాలగూడ: రోడ్డు ప్రమాదం.. వృద్ధుడి మృతి

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన మిర్యాలగూడ మండలం శ్రీనివాసనగర్‌లో జరిగింది. ఎస్ఐ వివరాలు.. నేరేడుచర్ల మండలం బక్కయ్యగూడెంకి చెందిన సైదులు(60) శ్రీనివాసనగర్‌లో జరుగుతున్న బంధువుల పెళ్లికి వచ్చాడు. తిరుగు ప్రయాణంలో కోదాడ- జడ్చర్ల రాహదారిని దాడుతున్నాడు. ఈ క్రమంలో అతణ్ని బైక్ ఢీకొంది. మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రి నుంచి నల్గొండ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.
Similar News
News March 5, 2026
NLG: ఏప్రిల్ 1 నుంచి అంగన్‌వాడీల్లో అల్పాహారం!

అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రాల్లోని చిన్నారులకు పౌష్టికాహారంతో పాటు అల్పాహారం అందించేందుకు చర్యలు చేపట్టింది. జిల్లాలోని అనుముల, చింతపల్లి, దామరచర్ల, కొండమల్లేపల్లి, DVK, MNGD, MLG, NKL, NLG ప్రాజెక్టుల పరిధిలో ఈ పథకం అమలు కానుంది. జిల్లాలోని మొత్తం 2,093 అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ అల్పాహార పథకం అందుబాటులోకి రానుంది.
News March 5, 2026
NLG: మూడు నెలల బియ్యం.. ఇక ఒకేసారి!

కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలో ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన బియ్యాన్ని ఏప్రిల్ నెలలోనే ఒకేసారి పంపిణీ చేయనున్నారు. ఒక్కో యూనిట్‌కు నెలకు 6 కిలోల చొప్పున, 3 నెలలకు కలిపి 18 కిలోలు ఇవ్వనున్నారు. జిల్లాలోని 5.38 లక్షల మంది కార్డుదారులకు దీనివల్ల లబ్ధి చేకూరుతుంది. 1051 రేషన్ షాపులకు 23,700 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తరలించాలని ఎఫ్సీఐ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.
News March 5, 2026
దివ్యాంగులు, వయోవృద్ధులకు ప్రత్యేక ప్రజావాణి: కలెక్టర్

జిల్లాలోని దివ్యాంగులు, వయోవృద్ధుల సమస్యల పరిష్కారానికి ఈనెల 7న కలెక్టరేట్‌లో ‘ప్రత్యేక ప్రజావాణి’ నిర్వహించనున్నట్లు కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ తెలిపారు. శనివారం ఉదయం 11:00 నుంచి మధ్యాహ్నం 1:00 గంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. బాధితులు నేరుగా వచ్చి తమ విన్నపాలను అందజేయవచ్చని, అధికారులు తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరిస్తారని కలెక్టర్ పేర్కొన్నారు.


