News August 2, 2024
మిర్యాలగూడ వాసికి ఏడాదికి రూ.34 లక్షల వేతనం

మిర్యాలగూడకి చెందిన అయేషా ప్రముఖ సంస్థంలో ఏడాదికి రూ.34లక్షల వేతనంతో సాఫ్ట్వేర్ డెవలపర్ ఉద్యోగానికి ఎంపికైంది. ఆమె నాగ్పూర్ ఐఐటీలో బీటెక్ 4వ సంవత్సరం చదువుతోంది. తండ్రి నుస్రత్ అలీ మిర్యాలగూడ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కాగా తల్లి అజ్మత్ గృహిణీ. అయేషా ప్రాథమిక విద్య మిర్యాలగూడలో పూర్తి చేసింది. అయేషాను కుటుంబ సభ్యులు, బంధువులు అభినందించారు.
Similar News
News November 22, 2025
NLG: ‘ఉచిత మెట్రిక్ స్కాలర్షిప్లకు దరఖాస్తు చేసుకోండి’

నల్గొండ జిల్లాలోని ఎస్సీ విద్యార్థులు వెంటనే ప్రీ-మెట్రిక్ స్కాలర్షిప్లకు దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీడీడీ (SCDD) డిప్యూటీ డైరెక్టర్ శశికళ కోరారు. 9, 10 తరగతులు చదువుతున్న పేద దళిత విద్యార్థులకు ఈ పథకం ద్వారా రూ. 3,500 బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయని ఆమె తెలిపారు. అర్హులైన 3080 మంది విద్యార్థులు మీ-సేవ ద్వారా క్యాస్ట్, ఇన్కమ్, ఆధార్ వివరాలతో వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News November 21, 2025
ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ: కలెక్టర్

ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం లోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంపై శుక్రవారం ఆమె టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 22న జిల్లా కేంద్రంతో పాటు నియోజకవర్గ, మండల కేంద్రాల్లో చీరల పంపిణీకి వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి చీరలను పంపిణీ చేయాలన్నారు. గ్రామస్థాయిలో కార్యదర్శి జిల్లా కలెక్టర్ నామినీగా ఉంటారన్నారు