News August 2, 2024
మిర్యాలగూడ వాసికి ఏడాదికి రూ.34 లక్షల వేతనం
మిర్యాలగూడకి చెందిన అయేషా ప్రముఖ సంస్థంలో ఏడాదికి రూ.34లక్షల వేతనంతో సాఫ్ట్‌వేర్ డెవలపర్ ఉద్యోగానికి ఎంపికైంది. ఆమె నాగ్‌పూర్ ఐఐటీలో బీటెక్ 4వ సంవత్సరం చదువుతోంది. తండ్రి నుస్రత్ అలీ మిర్యాలగూడ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కాగా తల్లి అజ్మత్ గృహిణీ. అయేషా ప్రాథమిక విద్య మిర్యాలగూడలో పూర్తి చేసింది. అయేషాను కుటుంబ సభ్యులు, బంధువులు అభినందించారు.
Similar News
News October 13, 2024
మొదటి స్థానంలో నిలిచిన దేవరకొండ ఆర్టీసీ డిపో
దేవరకొండ ఆర్టీసీ డిపో నుంచి నడిపిన బస్సుల ద్వారా ఈనెల 11న ఒక్కరోజే దేవరకొండ డిపో రూ.35.86 లక్షలు ఆర్జించి, ఓఆర్‌లో 118.90 తో రాష్ట్రంలోనే మొదటి స్థానం సాధించినట్లు డిపో మేనేజర్ తల్లాడ రమేష్ బాబు ఆదివారం తెలిపారు. మొత్తంగా 46 వేల 755 కిలోమీటర్లు నడిపి 51,750 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు క్షేమంగా చేరవేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా డిపో ఉద్యోగులకు డీఎం అభినందనలు తెలిపారు.
News October 13, 2024
తుంగతుర్తి: వేలంపాటలో దుర్గామాత చీరను దక్కించుకున్న ముస్లింలు
తుంగతుర్తి మండలం అన్నారు గ్రామంలో దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన దుర్గమ్మ తల్లి చీర వేలం పాటలో ముస్లిం సోదరులు చీరను దక్కించుకున్నారు. ఈ మేరకు ఎండి.సిద్ధిక్ భాష, ఆజం అలీ పాల్గొని చీరను రూ.4100లకు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన వేలం పాటలో చాలామంది పోటీపడి వేలం హోరాహోరీగా సాగింది. ఈ సంఘటన కులమత సామరస్యతకు ప్రత్యేకంగా నిలవడంతో పలువురి ప్రశంసలు అందుకున్నారు.
News October 13, 2024
NLG: పత్తి రైతుకు దక్కని మద్దతు ధర
నల్గొండ జిల్లాలో పత్తి పంట పండిస్తున్న రైతులు దళారుల చేతిలో దగా పడుతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పత్తికి కనీస ధర కూడా లభించకపోవడంతో దళారుల ఊబిలో చిక్కుకునే పరిస్థితి ఏర్పడుతోంది. ప్రస్తుతం మద్దతు ధర క్వింటాకు రూ.7,521 ఉండగా వ్యాపారులు రూ.6300 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో సాగు చేసిన పత్తి రైతుల చేతికి వచ్చినా ఇంకా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించలేదని తెలిపారు.