News August 19, 2024
మిర్రర్ ఇమేజ్ తరహాలో పాఠ్య పుస్తకాలు

మిర్రర్ ఇమేజ్ తరహాలో పాఠ్య పుస్తకాలను ప్రభుత్వం అందజేస్తోంది. హైదరాబాద్ జిల్లాలోని 890 బడుల్లో 8, 9 తరగతి వారికి రెండేళ్ల నుంచి వీటిని అందిస్తున్నారు. పుస్తకంలో తొలిపేజీ ఆంగ్లం.. రెండో పేజీ తెలుగు, మూడో పేజీ ఆంగ్లం నాలుగో పేజీ తెలుగు ఇలా పుస్తకాలను ప్రచురించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఇంగ్లిష్‌ను సులభంగా అర్థం చేసుకునేందుకు ద్విభాషా పాఠ్యపుస్తకాలు ఉపయెగపడుతున్నాయి.
Similar News
News December 2, 2025
HYD: ప్రముఖ హోటళ్లపై కొనసాగుతున్న ఐటీ సోదాలు

హైదరాబాద్‌లో ప్రముఖ హోటళ్ళపై ఐటీ శాఖ దాడుల పరంపర కొనసాగుతోంది. వుడ్‌బ్రిడ్జ్ హోటల్ యజమాని హర్షద్ అలీ ఖాన్ను ఐటీ అధికారులు విచారించారు. పిస్తా హౌస్, షాగోస్, మేఫిల్ వంటి హోటళ్లలో సోదాలు నిర్వహించిన అధికారులు భారీగా నగదు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వీరి ఆర్థిక లావాదేవీలపై, ఇతర హోటళ్లతో ఉన్న సంబంధాలపై ఐటీ శాఖ దృష్టి సారించి పరిశీలన జరుపుతోంది.
News December 2, 2025
హైదరాబాద్‌లో మరో ఫిల్మ్ సిటీ

తెలంగాణ రైజింగ్ విజన్‌కు భారీ స్పందన లభిస్తోంది. ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ కంపెనీలు, వ్యక్తులు ఆసక్తి చూపుతున్నారు. బాలీవుడ్‌కు చెందిన అజయ్ దేవ్‌గణ్ ఫ్యూచర్ సిటీలో తన ఫిల్మ్ సిటీ ఏర్పాటుకు సిద్ధం అవుతున్నారు. ఇదివరకు సీఎం రేవంత్ రెడ్డిని కలసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వంతో M0U చేసుకోనున్నట్లు సమాచారం.
News December 2, 2025
HYDలో యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్

హైదరాబాద్‌లో మరో ప్రతిష్టాత్మక కార్యక్రమం జరగనుంది. యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం హైదరాబాదులో ఏర్పాట్లు జరుగుతున్నాయి. 23 యూరోపియన్ దేశాలకు చెందిన 23 ఉత్తమ చిత్రాలు ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితం కానున్నాయి. ప్రసాద్ ల్యాబ్ ప్రివ్యూ థియేటర్, శ్రీసారథి స్టూడియోస్, అలయన్స్ ఫ్రాన్సిస్ హైదరాబాద్‌లో ఈ సినిమాలు ప్రదర్శించనున్నారు. ఈనెల 5వ తేదీ నుంచి 14 వరకు ఉచితంగా ప్రదర్శించనున్నట్లు తెలిపారు.


