News March 10, 2025
మిలియన్ మార్చ్కు ప్రత్యేక స్థానం: దాస్యం

తెలంగాణ ఉద్యమ చరిత్రలో మిలియన్ మార్చ్(10 మార్చి, 2011)కు ప్రత్యేక స్థానం ఉందని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ట్వీట్ చేశారు. ఉద్యమ సారథి కేసీఆర్ నాయకత్వంలో, నిర్బంధాలను చేదిస్తూ, జై తెలంగాణ నినాదాలతో యావత్ తెలంగాణ హుస్సేన్ సాగర్ తీరానికి చేరిందని, అపూర్వ ఘట్టం నేటితో 14 ఏళ్లు అని, తాను కార్యక్రమంలో పాల్గొన్న ఫోటోలను వినయ్ భాస్కర్ జతపరిచారు.
Similar News
News November 28, 2025
మెదక్: తాత్కాలికంగా ప్రజావాణి వాయిదా

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలు ముగిసే వరకు ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ శుక్రవారం తెలిపారు. హెల్ప్ డెస్క్ ద్వారా మాత్రమే ఫిర్యాదులు స్వీకరించబడునున్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
News November 28, 2025
కొమురం భీం జిల్లా SC-ST టీచర్స్ ఫెడరేషన్ కమిటీ ఎన్నిక

ఎస్సీ, ఎస్టీ టీచర్స్ ఫెడరేషన్ కొమురం భీం జిల్లా శాఖ 2026-28 పదవీకాలానికి ఎన్నికలు రెబ్బెన జడ్పీహెచ్ఎస్లో రాష్ట్ర సలహాదారు జాడి కేశవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి చరణ్ దాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అధ్యక్షుడిగా దుర్గం తులసిరామ్, ప్రధాన కార్యదర్శిగా వడ్లూరి రాజేష్ ఎంపికయ్యారు. ఉపాధ్యాయుల సమస్యలు, రిజర్వేషన్ల అమలు, అంబేడ్కర్ భావాల సాధనకు కృషి చేస్తామని నాయకులు పేర్కొన్నారు.
News November 28, 2025
నల్గొండ జిల్లాలో ఇవాళ్టి టాప్ న్యూస్

✓మర్రిగూడ: నగదు ఎలా స్వీకరిస్తున్నారు.. ఇలా త్రిపాఠి వాకబు
✓చెర్వుగట్టు హుండీ ఆదాయం లెక్కింపు
✓చండూరు: కుల ధృవీకరణ కోసం పడిగాపులు
✓మిర్యాలగూడ: భర్త ఇంటి ముందు భార్య ఆందోళన
✓నల్గొండ: కుక్కల స్వైర విహారం.. 22 గొర్రెల మృతి
✓కట్టంగూరు: కాంగ్రెస్లో బయటపడ్డ వర్గ విభేదాలు
✓చిట్యాల: అప్పుడు వార్డు మెంబర్.. ఇప్పడు మండలి ఛైర్మన్


