News March 22, 2025

మిషన్ వాత్సల్య పథకానికి అర్హుల జాబితా సిద్ధం చేయాలి: కలెక్టర్

image

మిషన్ వాత్సల్య పథకానికి అర్హులైన వారి జాబితాను సిద్ధం చేయాలని కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. కలెక్టరేట్‌లో మిషన్ వాత్సల్య పథకం అర్హుల ఎంపికపై జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో 216 మంది లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు కలెక్టర్‌కు అధికారులు తెలిపారు. మిషన్ వాత్సల్య పథకానికి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, అర్హులైన వారిని గుర్తించి ఇవ్వాలని కలెక్టర్ సూచించారు.

Similar News

News February 23, 2026

తడికలపూడి వద్ద రెండు బైకులు ఎదురెదురుగా ఢీ

image

కామవరపుకోట మండలం తడికలపూడి శివారులో ఆదివారం సాయంత్రం రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులలో ఒకరు కామవరపుకోట, మరొకరు మచిలీపట్నం ప్రాంతానికి చెందిన వారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి, ఏలూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News February 23, 2026

వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. టెన్నిస్‌లో సంచలనం

image

ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్(ITF) W100 టోర్నీ(బెంగళూరు) రన్నరప్‌గా నిలిచిన ప్లేయర్ వైష్ణవి అడ్కర్‌పై ప్రశంసలొస్తున్నాయి. 2009లో సానియా మీర్జా తర్వాత WTA 100 సింగిల్స్ ఫైనల్ చేరిన తొలి భారత మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. పుణేకి చెందిన 21 ఏళ్ల వైష్ణవి ఈ టోర్నీలో వైల్డ్ కార్డుగా ఎంట్రీ ఇచ్చారు. అద్భుతంగా ఆడుతూ ఫైనల్‌కు చేరారు. కానీ ఫైనల్‌లో హన్నే వాండేవింకెల్(బెల్జియం) చేతిలో ఓడారు.

News February 23, 2026

రాజంపేట: ఇంటర్ విద్యార్థికి యాక్సిడెంట్

image

పరీక్ష రాయాల్సిన విద్యార్థి ఆసుపత్రి పాలైన ఘటన ఇది. రాజంపేట డివిజన్ పిచ్చిగుంట్లపల్లికి చెందిన ఇంటర్ విద్యార్థికి వీరబల్లిలో పరీక్షా కేంద్రం కేటాయించారు. ఇవాళ ఉదయం తన ఇంటి నుంచి బైకుపై పరీక్షా కేంద్రానికి బయల్దేరాడు. నీలవాండ్లపల్లి సమీపంలో ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టి వెళ్లిపోయింది. రోడ్డుపై తీవ్ర గాయాలతో ఉన్న విద్యార్థిని గుర్తించి రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.