News April 5, 2024
మిసెస్ ఇండియా పోటీల్లో ‘గోదారి’ మహిళ సత్తా
మిసెస్ ఇండియా పోటీల్లో ఏలూరు జిల్లా భీమడోలు మండలం గుండుగొలను గ్రామానికి చెందిన రుద్రరాజు ఛాయాదేవి సత్తా చాటారు. గత నెల 30న ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్‌లో జరిగిన ఈ పోటీల్లో మిసెస్ ఇండియా(క్లాసిక్)గా ఎంపికయ్యారు. ఈమె ప్రాథమిక విద్యాభ్యాసం అంతా గుండుగొలనులోనే సాగగా.. వివాహానంతరం హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. MBA చదివిన ఛాయాదేవి ప్రస్తుతం శ్రీవిహారి సర్వీసెస్ లిమిటెడ్‌కు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
Similar News
News January 21, 2025
Photo Of The Day: భార్యాభర్త ఫైరింగ్
ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం తడికలపూడిలో ఇవాళ పోలీస్ ఫైరింగ్ శిక్షణ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఏలూరు ఎస్పీ శివ ప్రతాప్ కిషోర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ధాత్రి రెడ్డి పాల్గొన్నారు. భార్యాభర్తలైన ఎస్పీ, జేసీ ఒకేసారి ఇలా పక్కపక్కనే నిలబడి ఫైరింగ్ చేశారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
News January 21, 2025
ప.గో. కోళ్లకు అంతు చిక్కని వైరస్.. లక్షకు పైగా మృతి
కోళ్లకు అంతుచిక్కని వైరస్ సోకి మృత్యువాత పడటంతో కోళ్ల పెంపకందారులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని రోజులుగా జిల్లాలో లక్షకు పైనే కోళ్లు మృతి చెందినట్లు చెబుతున్నారు. పందెం కోళ్లకు సైతం వైరస్ సోకి చనిపోవడంతో ఆర్థికంగా నష్టపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. ఉదయం ఆరోగ్యంగా కనిపించిన కోళ్లు సాయంత్రానికి మృతి చెందుతున్నాయని చెబుతున్నారు. వైరస్ ప్రభావంతో అమ్మకాలు తగ్గి, ధరలు పతనమవుతున్నాయని అంటున్నారు.
News January 21, 2025
ఏలూరు: రోడ్డు ప్రమాదంలో ప్రైవేట్ ఉద్యోగి మృతి
చిట్యాల మండలం వెలిమినేడు శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏలూరు జిల్లా ముసునూరు మండలం చిల్లబోయినపల్లి గ్రామానికి చెందిన జువ్వనపూడి విక్రమ్ మృతి చెందాడు. హైదరాబాద్ లో విక్రమ్ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంటాడు. సంక్రాంతి పండుగకు చిల్లబోయినపల్లి ఇంటికి వచ్చాడు. తిరిగి సోమవారం బైక్‌పై హైదరాబాద్ వెళ్తుండగా వెలిమినేడు వద్ద బొలేరో వాహనం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన విక్రమ్ అక్కడిక్కడే మృతి చెందాడు.