News July 22, 2024
మిస్టరీగానే నరసాపురం MPDO మిస్సింగ్

నరసాపురం MPDO వెంకటరమణారావు ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ఆయనకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చిన కాల్స్, వారి ఖాతాలకు బదిలీ అయిన సొమ్ముపై పోలీసులు దృష్టిసారించారు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి పలుసార్లు కాల్స్ వచ్చినట్లు తెలుస్తోంది. సైబర్ నేరగాళ్ల బెదిరింపులతో MPDO నుంచి 2 దఫాల్లో మొత్తం రూ.3.2 లక్షలు వారి ఖాతాలకు జమ అయినట్లు సమాచారం. ఈ ముఠా చేతిలో ఇదేరీతిలో పలువురు మోసపోయినట్లు తెలుస్తోంది.
Similar News
News November 7, 2025
ఆక్వా రైతుల అభివృద్ధికి సహకారం అందించాలి: కలెక్టర్

జిల్లాలోని ఆక్వా రైతుల అభివృద్ధికి సహకారం అందించాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. శుక్రవారం న్యూఢిల్లీ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ జాయింట్ సెక్రటరీ నీతు కుమారి మత్స్య శాఖపై జిల్లా కలెక్టర్లు, మత్స్య శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. భీమవరం కలెక్టరేట్ నుంచి హాజరైన కలెక్టర్ నాగరాణి, జాయింట్ సెక్రటరీ నీతు కుమారితో పలు కీలక అంశాలను తెలియజేశారు.
News November 7, 2025
భీమవరం: క్యాన్సర్ అవగాహన దినోత్సవ ర్యాలీ

ముందస్తు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల ద్వారా వ్యాధిని నూరు శాతం నిరోధించవచ్చని కలెక్టర్ నాగరాణి అన్నారు. జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం భీమవరం ప్రకాశం చౌక్‌లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. క్యాన్సర్ వ్యాధిని ప్రారంభ దశలో గుర్తించినట్లయితే, వ్యాధి నుంచి కోలుకునే అవకాశం గణనీయంగా పెరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఎమ్మెల్యే రామాంజనేయులు, ఎస్పీ నయీం అస్మీ పాల్గొన్నారు.
News November 7, 2025
జావెలిన్ త్రోలో కొంతేరు కుర్రాడి సత్తా

యలమంచిలి(M) కొంతేరు ZPHS 9వ తరగతి విద్యార్థి పెదపూడి అరుణ్ కుమార్ అండర్-17 బాలుర జావెలిన్ త్రో విభాగంలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు హెచ్ఎం డి. రాంబాబు తెలిపారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పెదవేగిలో జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో అరుణ్ కుమార్ 42 మీటర్లు జావెలిన్ విసిరి ప్రథమ స్థానం సాధించాడు. ఈ నెల 22న వినుకొండలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో అరుణ్ జిల్లాకు ప్రాతినిధ్యం వహించనున్నాడు.


