News February 23, 2025
మిస్డ్ కాల్ వస్తే తిరిగి ఫోన్ చేయకండి: అన్నమయ్య ఎస్పీ

గుర్తుతెలియని నంబర్లనుంచి మిస్డ్ కాల్ వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి కాల్ చేయొద్దని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు హెచ్చరించారు. ఎస్పీ మాట్లాడుతూ.. సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్న +371(5), +381(2) నంబర్ల నుంచి కాల్ చేసి #90లేదా #09డయల్ చేయమని అడిగితే ఎట్టిపరిస్థితుల్లో కాల్ చేయవద్దన్నారు. అలాచేస్తే నేరగాళ్లు మీ ఫోన్ హ్యాక్ చేస్తారు. సైబర్ నేరాలకు గురైతే వెంటనే1930కు కాల్ చేయమన్నారు.
Similar News
News March 26, 2025
సిరిసిల్ల జిల్లాలో 14 మంది విద్యార్థులు గైర్హాజర్

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బుధవారం జరిగిన పదోతరగతి పరీక్షలకు 14 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు తెలిపారు. జిల్లాలో మొత్తం 35 పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. 6767 మంది విద్యార్థులకు 6750 విద్యార్థులు పరీక్ష రాయగా 14 మంది విద్యార్థులు పరీక్షలు హాజరుకాలేదని తెలిపారు.
News March 26, 2025
ఉగాది రోజు సన్నబియ్యం పథకం ప్రారంభం: మంత్రి ఉత్తమ్

ఉగాది రోజున సన్నబియ్యం పథకం ప్రారంభించనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రేషన్‌కార్డుదారులకు 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇవ్వబోతున్నట్లు చెప్పారు. సన్నబియ్యంపై సభ్యుల సలహాలు, సూచనలు తీసుకుంటామని అన్నారు. సన్నబియ్యం స్కీమ్‌తో 84 శాతం మంది పేదలు లబ్ధి పొందనున్నారని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు.
News March 26, 2025
బాత్రూమ్‌లో ఎంతసేపు ఉంటున్నారు?

కొందరు అరగంట సేపైనా బాత్రూమ్‌లోనే ఉండిపోతూ కాలక్షేపం చేస్తుంటారు. టాయిలెట్ కమోడ్‌పై కూర్చొని రీల్స్ చూస్తుంటారు. ఇలా ఎక్కువ సేపు ఒకేచోట కూర్చోవడంతో పాయువు దగ్గర కండరాలపై మరింత ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల మలబద్ధకం, ఇన్ఫెక్షన్లు రావొచ్చని వైద్యులు చెబుతున్నారు. టాయిలెట్‌లో ఎక్కువ సేపు ఫోన్ చూడటంతో మెడ, వెన్ను నొప్పి, తిమ్మిర్లు వస్తాయి. అందుకే వెళ్లిన పనిని త్వరగా కానిచ్చి బయటపడాలంటున్నారు.