News February 17, 2025

మిస్డ్ కాల్ వస్తే తిరిగి కాల్ చేయవద్దు: అన్నమయ్య ఎస్పీ

image

గుర్తుతెలియని నంబర్ల నుంచి మిస్డ్ కాల్ వస్తే ఎట్టిపరిస్థితుల్లో తిరిగి కాల్ చేయొద్దు అని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. +371(5), +381 (2) నంబర్ల నుంచి కాల్ చేసి #90 లేదా #09 డయల్ చేయమని అడిగితే ఎట్టిపరిస్థితుల్లో కాల్ చేయవద్దన్నారు. అలా చేస్తే నేరగాళ్లు మీ ఫోన్‌ను హ్యాక్ చేస్తారన్నారు. సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930ను సంప్రదించాలన్నారు.

Similar News

News March 17, 2026

KKRకు గాయాల ‘దెబ్బ’

image

IPL ప్రారంభానికి ముందు KKRను గాయాల బెడద వేధిస్తోంది. ఇప్పటికే ఇంజూరీతో హర్షిత్ రాణా <<19394540>>నడవలేని <<>>స్థితిలో ఉన్నారు. T20 WC సందర్భంగా గాయపడ్డ శ్రీలంక పేసర్ పతిరణ ఆడటం కూడా అనుమానంగా మారింది. KKR అతడిని రూ.18Crకు కొనుగోలు చేసింది. అయితే ఏదో ఒక దశలో పతిరణ అందుబాటులోకి వస్తాడని భావిస్తోంది. పతిరణ, రాణాకు రీప్లేస్‌మెంట్‌ తీసుకోవద్దని నిర్ణయించింది. ముస్తాఫిజుర్ ప్లేస్‌లో <<19375126>>ముజరబానిని<<>> తీసుకుంది.

News March 17, 2026

కృష్ణా: వారికి నేడే ఆఖరి రోజు!

image

జిల్లాలోని మున్సిపల్ పాలకవర్గ సభ్యులకు నేడు చివరి రోజు కానుంది. దీంతో ఎన్నికైన ప్రజాప్రతినిధుల పాలనకు ముగింపు పలుకుతూ, రేపటి నుంచి పట్టణ పరిపాలన పూర్తిగా ప్రభుత్వ నియమిత ప్రత్యేక అధికారుల చేతుల్లోకి వెళ్లనుంది.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారుల నియామకానికి మార్గదర్శకాలు జారీ చేసి అధికారులను ప్రకటించింది. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీల్లో పరిపాలన కొనసాగింపు బాధ్యతలు అధికారులు చేపట్టనున్నారు.

News March 17, 2026

కర్నూలు: క్వింటా పత్తి ధర ఎంతంటే?

image

ఆదోని వ్యవసాయ మార్కెట్లో సోమవారం ధరలు ఇలా ఉన్నాయి. పత్తి క్వింటా గరిష్ఠ ధర రూ.8,399, వేరుశనగ గరిష్ఠ ధర రూ.8,954, ఆముదాలు గరిష్ఠ ధర రూ.6,112 పలికాయి. శనగలు గరిష్ట ధర రూ 5,083, కందులు గరిష్ఠ ధర రూ.7,425 వరకు అమ్ముడయ్యాయి. సీసీఐ కొనుగోలు గడువు ముగియడంతో కేంద్రాలు మూతపడి, పత్తి మొత్తం యార్డుకు వస్తోంది. వేరుశనగ ధరలు వారం రోజులుగా పడిపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.