News June 13, 2024
మిస్సింగ్.. చనిపోతున్నానంటూ భార్యకు వీడియో కాల్

ప.గో జిల్లా తణుకుకు చెందిన వ్యక్తి రెండ్రోజులుగా కనిపించడంలేదని అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. ఆలమూరివారి వీధిలో నివాసం ఉంటున్న అరిపాక హరీశ్ ఈనెల 11న ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. అదే రోజు రాత్రి హరీశ్ భార్య జయశ్రీకి వీడియో కాల్ చేసి తాను చనిపోతున్నానని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. దీంతో ఆందోళన చెందిన జయశ్రీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Similar News
News December 1, 2025
మొగల్తూరు: ‘నేడు పేరుపాలెం బీచ్కు రావొద్దు’

తుఫాను హెచ్చరికలు, సముద్రంలో అలల ఉద్ధృతి కారణంగా జిల్లాలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పేరుపాలెం బీచ్కి సోమవారం సందర్శకులను అనుమతించబోమని మొగల్తూరు ఎస్ఐ జి.వాసు తెలిపారు. వాతావరణ మార్పులతో అలలు వేగంగా వస్తుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. పర్యాటకులు, స్థానికులు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సహకరించాలన్నారు. బీచ్ సందర్శనకు రావొద్దని సూచించారు.
News December 1, 2025
భీమవరంలో నేడు యధావిధిగా PGRS.!

భీమవరం కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లా, మండల స్థాయి అధికారులు అందుబాటులో ఉండి ప్రజలనుంచి అర్జీలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. కార్యాలయానికి రాలేనివారు 1100 కాల్ సెంటర్ ద్వారా లేదా meekosam.ap.gov.in వెబ్సైట్లో తమ సమస్యలను నమోదు చేసుకోవచ్చని సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.