News August 2, 2024
మిస్ యూనివర్స్-ఇండియాకు ఎంపికైన యువతికి సీఎం అభినందన

మిస్ యూనివర్స్-ఇండియాకు ఏపీ నుంచి అర్హత సాధించిన చందన జయరాం అనే యువతి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును శుక్రవారం సచివాలయంలో కలిశారు. కుప్పం నియోజకవర్గం, శాంతిపురం (M), ఎం.కె.పురానికు చెందిన చందనా జయరాం ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన పోటీల్లో మిస్ యూనివర్స్ ఇండియాకు రాష్ట్రం నుంచి ఎంపికయ్యారు. ముంబైలో జరిగే మిస్ యూనివర్స్ ఇండియా పోటీల్లో ఏపీ నుంచి చందనా పాల్గొననున్నారు.
Similar News
News February 24, 2026
ప్రైవేటుకు దీటుగా జూనియర్ కాలేజీలు: లోకేశ్

ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఖాళీలను యుద్ధప్రాతిపదికన భర్తీ చేస్తామని మంత్రి లోకేశ్ శాసనమండలిలో తెలిపారు. వీటిని ప్రైవేటుకు దీటుగా తీర్చిదిద్దుతామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం విద్యాశాఖను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఇంటర్‌లో మధ్యాహ్న భోజనం, ఉచిత పుస్తకాలు ఇస్తోందన్నారు. త్వరలో ల్యాబ్‌లు ఏర్పాటు చేసి, పోటీ పరీక్షల మెటీరియల్ కూడా అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.
News February 24, 2026
గుంటూరు: పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్

ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం పరీక్ష కేంద్రాలను కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తనిఖీ చేశారు. మంగళవారం గుంటూరు ప్రభుత్వ మహిళ జూనియర్ కళాశాలలో విద్యార్థులు పరీక్షలు రాస్తున్న తీరును గమనించారు. పరీక్షా కేంద్రంలో కనీస అవసరాలైన తాగునీరు, వైద్య శిబిరాలు ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్షల సమయంలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా, విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకొనుటకు బస్ సౌకర్యం అంశాలను అడిగారు.
News February 24, 2026
గుంటూరు ఛానల్ వంతెన నిర్మాణానికి నిధులు

గుంటూరు ఛానల్‌పై వంతెన పునర్నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఛానల్‌లోని 33.300 కి.మీ వద్ద సింగిల్ లేన్ వంతెన నిర్మించనున్నారు. దీని కోసం రూ.94.88 లక్షలు కేటాయిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. జలవనరుల శాఖ ఈ మేరకు జీవో-92 విడుదల చేసింది. తగిన సాంకేతిక అనుమతులు తీసుకుని, నిబంధనల ప్రకారం పనులు ప్రారంభించాలని కృష్ణా డెల్టా చీఫ్ ఇంజినీర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.


