News March 25, 2024
మీడియా సెంటర్ ను సందర్శించిన జిల్లా కలెక్టర్

పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో సమీకృత కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణం, గ్రౌండ్ ఫ్లోర్ రూమ్ నెంబర్ (31)లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్, మొదటి అంతస్తులో ఉన్న కంట్రోల్ రూమ్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు సమాచారం అందించడానికి, వివిధ రాజకీయ పార్టీల ప్రచార అనుమతుల నిమిత్తం మీడియా సర్టిఫికేషన్ ఏర్పాటు చేశామన్నారు.
Similar News
News December 1, 2025
వరంగల్: హెచ్ఐవీ కేసులు ఆందోళనకరం!

జిల్లాలో ఇప్పటి వరకు 5,464 మంది హెచ్ఐవీ బాధితులు నమోదు కాగా, వీరిలో 4,558 మందికి ప్రభుత్వం ప్రతి నెల ఉచిత మందులు అందిస్తోంది. 863 మంది బాధితులకు ఏఆర్జే ద్వారా నెలకు రూ.2,016 పెన్షన్ ఇస్తున్నారు. నెలకు సగటున 36 కొత్త హెచ్ఐవీ కేసులు వెలుగులోకి వస్తుండటం, గర్భిణులు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో హై రిస్క్ వ్యక్తులు 3,498 మంది ఉన్నారు.
#నేడు ప్రపంచ ఎయిడ్స్ డే.
News November 30, 2025
రేపటి ప్రజావాణి రద్దు: కలెక్టర్

సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రేపు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వరంగల్ కలెక్టర్ సత్య శారద తెలిపారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ ఉండదని స్పష్టంచేశారు. జిల్లాలోని ప్రజలు ఈ నిర్ణయాన్ని గమనించి సహకరించాలని కలెక్టర్ కోరారు.
News November 30, 2025
పర్వతగిరి: నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ పరిశీలన..!

స్థానిక సంస్థల ఎన్నికలకు చేపట్టిన నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియను జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు, రాష్ట్ర బీసీ కమిషనర్ బాలమాయ దేవి పరిశీలించారు. ఈ సందర్భంగా అభ్యర్థుల దరఖాస్తుల పరిశీలన, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రక్రియ, నియమ నిబంధనలను పారదర్శకంగా చేపట్టాలని రిటర్నింగ్ అధికారులకు సూచించారు. ప్రతి దశను నిష్పక్షపాతంగా చేపట్టాలన్నారు. ఇండస్ట్రియల్ జీఎం నరసింహమూర్తి ఎంపీడీవో శంకర్ పాల్గొన్నారు.


