News November 19, 2024
మీరు కట్టుకున్న శారీ చేనేతేనా..?:RRR

అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో చేనేత పరిశ్రమ కార్మికుల సమస్యలపై నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి మాట్లాడారు. నెలలో ఒకరోజు ఉద్యోగులు చేనేత వస్త్రాలు ధరించే విధంగా జీవో తెచ్చే ఆలోచన ప్రభుత్వానికి ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. ఈ క్రమంలో ‘మీరు సభకు ఇప్పుడు చేనేతే వేసుకున్నారా.. మీ శారీ చేనేతేనా’ అని డిప్యూటీ స్పీకర్ RRR ఆమెని అడిగారు. స్పందించిన ఎమ్మెల్యే మాధవి అవునంటూ నవ్వుతూ బదులిచ్చారు.
Similar News
News December 5, 2025
విజయనగరం జిల్లాలో మాతృ, శిశు మరణాలు సంభవిస్తే చర్యలు: కలెక్టర్

జిల్లాలో ఎక్కడైనా మాతృ, శిశు మరణాలు సంభవిస్తే సహించేది లేదని జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి స్పష్టం చేశారు. కలెక్టరేట్లోని DRC సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో అత్యున్నత ప్రభుత్వ యంత్రాగం ఉందని, ప్రభుత్వం మంచి పోషకాహారాన్ని సరఫరా చేస్తోందని, అయినప్పటికీ అక్కడక్కడా మాతృ, శిశు మరణాలు సంభవించడం బాధాకరమన్నారు. ఇకముందు జరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
News December 5, 2025
విజయనగరంలో డిగ్రీ విద్యార్థి సూసైడ్

విజయనగరంలోని స్థానిక ప్రభుత్వ బీసీ వసతి గృహంలో ఓ విద్యార్థిని గురువారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మహారాజా కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న స్వాతిగా పోలీసులు గుర్తించారు. ఈమె స్వస్థలం శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మంగా తెలిపారు. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
News December 4, 2025
VZM: జిల్లా వ్యాప్తంగా రేపు మెగా పేరెంట్-టీచర్ మీట్

జిల్లా వ్యాప్తంగా శుక్రవారం మెగా పేరెంట్-టీచర్ మీట్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. విద్యార్థుల విద్యా ప్రగతి, హాజరు, నైపుణ్యాలు, పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై తల్లిదండ్రులతో చర్చించనున్నట్లు చెప్పారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పలు పాఠశాలల్లో పాల్గొననున్నారని, తల్లిదండ్రులు తప్పనిసరిగా పాల్గొని పిల్లల భవిష్యత్తు నిర్మాణంలో భాగస్వాములవ్వాలన్నారు.


