News December 29, 2024
మీరు బుక్ ఫెయిర్‌కు వెళ్లలేదా.. నేడే ఆఖరు!

చినిగిన చొక్కా తొడుక్కో.. ఒక మంచి పుస్తకం కొనుక్కో అన్నారు కందుకూరి వీరేశలింగం. ఒక మంచి పుస్తకం కొనకుంటే, నీ జీవితమంతా అజ్ఞానమే అన్నారు మరికొందరు మేధావులు. అందుకేనేమో హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన బుక్ ఫెయిర్ – 2024 నిరంతరం పుస్తక ప్రియులతో నిండుగా కనిపిస్తోంది. ఈ నెల 19న ప్రారంభమైన బుక్ ఫెయిర్ నేటితో ముగియనుంది. మరి మీరు బుక్ ఫెయిర్‌కు వెళ్లారా..? అక్కడ ఏ పుస్తకం కొన్నారో కామెంట్ ప్లీజ్..!
Similar News
News November 20, 2025
HYD: ఆందోళన కలిగిస్తున్న రేబిస్ మరణాలు

నగరవాసులను రేబీస్ మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి పరిధిలో రేబీస్‌తో చనిపోయిన వారి సంఖ్య ఈ ఏడాది సెప్టెంబరు వరకు 32కు చేరింది. 2023లో 13, 2024లో 16 మంది మృతి చెందితే ఈఏడాది ఈ సంఖ్య రెట్టింపు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇదిలా ఉండగా నల్లకుంట ఫీవర్ ఆస్పత్రికి ఏటా 20వేల మంది కుక్కకాటు బాధితులు వస్తారని సూపరింటెండెంట్ రాజేంద్రప్రసాద్ తెలిపారు.
News November 20, 2025
HYD: 3వేల మంది అతిథులు.. 2,500 మంది పోలీసులు

వచ్చేనెల 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీ ప్రాంతంలోని కందుకూర్ మీర్ఖాన్పేటలో జరిగే గ్లోబల్ సమ్మిట్‌కు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించనున్నారు. ఈ సమ్మిట్‌కు దాదాపు 3వేల మంది వీఐపీలు, వారి అసిస్టెంట్లు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో పోలీసులు వెయ్యి సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. అంతేకాక 2,500 మంది పోలీసులు భద్రతా చర్యల్లో పాల్గొంటున్నారు.
News November 20, 2025
షుగర్ కేసులు.. దేశంలోనే హైదరాబాద్ నం.4

దేశంలో డయాబెటిస్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజా నివేదికల ప్రకారం దేశవ్యాప్తంగా డయాబెటిస్ కేసులు అధికంగా ఉన్న నగరాల్లో HYD 4వ స్థానంలో నిలిచింది. జీవనశైలి, ఒత్తిడి, వ్యాయామం తగ్గడం, జంక్‌ఫుడ్, అధికంగా కార్బ్స్ తీసుకోవడం దీనికి ప్రధాన కారణాలని వైద్యులు తెలిపారు. గొంతు తడారడం, తరచూ మూత్ర విసర్జన, శరీర బరువు తగ్గటం, అలసటగా ఉంటే అశ్రద్ధ చేయకుండా పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.


