News November 20, 2024

మీరు మారిపోయారు సార్..!

image

10సార్లు MLAగా.. పలు శాఖలకు మంత్రిగా పనిచేసిన అయ్యన్నపాత్రుని 40 ఏళ్ల రాజకీయ అనుభవం స్పీకర్ పాత్రలో అసెంబ్లీలో కనిపిస్తోంది. నాడు తనదైన మాటశైలితో ప్రత్యర్థులపై విరుచుకుపడ్డ ఆయన.. నేడు ప్రశ్నోత్తరాల సమయంలో, జీరో అవర్‌లో మంత్రులు, MLAలకు సూచనలిస్తున్నారు. కొత్త MLAలకు బడ్జెట్‌పై తరగతులు ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. దీంతో ‘మీరు మారిపోయారు సార్’ అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.

Similar News

News March 9, 2026

విశాఖలో బ్యాడ్మింటన్ ఆడేవారికి గుడ్ న్యూస్

image

విశాఖపట్నం స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ మెంబర్‌షిప్ కోసం జీవీఎంసీ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 6 అంతర్జాతీయ స్థాయి కోర్టులతో కూడిన ఈ స్టేడియంలో 12 ఏళ్ల లోపు పిల్లలకు ఏడాదికి ₹2,600, పెద్దలకు ₹15,000 ఫీజుగా నిర్ణయించారు. ఉదయం 5 నుండి 10 వరకు, సాయంత్రం 4 నుండి 10 గంటల వరకు ఆడేందుకు అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.

News March 9, 2026

విశాఖ: హిందుజా పవర్ ప్లాంట్‌కు భారీ జరిమాన

image

విశాఖలో హిందుజా పవర్ ప్లాంట్‌పై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చర్యలు తీసుకుంది. ప్లాంట్ నుంచి వచ్చే యాష్పాండ్ ధూళి వలన స్థానిక ప్రజలు చర్మవ్యాధులు బారిన పడుతున్నారని టీడీపీ కార్పొరేటర్ రౌత్ శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు హిందుజా పవర్ ప్లాంట్‌కు రూ.6 కోట్ల 78 లక్షలు జరిమానా విధించింది.

News March 9, 2026

విశాఖ భీమిలి బీచ్ రోడ్‌లో విరాగో రిసార్ట్ సీజ్..!

image

భీమిలి బీచ్ రోడ్డులో విరాగో రిసార్ట్‌ను సోమవారం అధికారులు సీజ్ చేశారు. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనలను ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జీవీఎంసీ కమిషనర్ ఉత్తర్వులతో అధికారులు రిసార్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం స్పష్టం చేయడంతో ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.