News March 24, 2024

మీరు హోలీ ఆడుతున్నారా.. జాగ్రత్త..!

image

ప్రజలు రేపు హోలీ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా పోలీసులు సూచిస్తున్నారు. రహదారులు, బహిరంగ ప్రదేశాల్లో గుర్తుతెలియని వ్యక్తులు, వాహనాలపై రంగులు చల్లకూడదని పేర్కొన్నారు. న్యూసెన్స్ చేస్తే సహించేది లేదని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే వైన్స్, బార్లు, పబ్లు, కల్లు కంపౌండ్లను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. >>>SHARE IT

Similar News

News September 13, 2024

TGSRTC డిపో మేనేజర్లతో రీజనల్ మేనేజర్ సమీక్ష

image

ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజనల్ మేనేజర్ సరి రామ్ గురువారం రీజనల్ కార్యాలయంలో అన్ని డిపోల మేనేజర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో వర్షాల వల్ల క్యాన్సిల్ అయిన బస్సుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే దసరా స్పెషల్ ఆపరేషన్ గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో అన్ని డిపోలో ట్రాఫిక్ ఇన్‌ఛార్జ్‌లు, గ్యారేజ్ ఇన్‌ఛార్జ్‌లు పాల్గొన్నారు.

News September 13, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్య అంశాలు

image

∆} వివిధ శాఖల అధికారులతో ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
∆} భద్రాచలం వద్ద తగ్గుముఖం పడుతున్న గోదావరి
∆} మణుగూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} అశ్వారావుపేటలో ఎమ్మెల్యే జారే పర్యటన
∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
∆} నేలకొండపల్లి మండలంలో పంట నష్టంపై సర్వే

News September 13, 2024

ఖమ్మం: ఈనెల 16న వైన్ షాపులు బంద్

image

గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఖమ్మం జిల్లాలో ఈ నెల 16న మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. వైన్ షాపులతో పాటు రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లను మూసివేయాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాలు జారీ చేశారు. 16న ఉదయం 6 గంటల నుంచి 17 ఉదయం 6 గంటల ఆదేశాలు పాటించాలని లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.