News October 30, 2024

మీర్జంపేట పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్: కలెక్టర్

image

కాల్వ శ్రీరాంపూర్ మండలం మీర్జంపేటలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న బి.శ్రీనివాస్‌ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ కోయ శ్రీ హర్ష మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.  సమాచారం ఇవ్వకుండా డ్యూటీ హాజరుకానుందన శ్రీనివాస్‌కు నోటీసులు జారీచేశారు. ఉన్నతాధికారులు అందించిన సూచనలు, ఆదేశాలను పట్టించుకోకుండా.. డ్యూటీలో చేరమని అక్టోబర్ 26న చివరి అవకాశం ఇచ్చినప్పటికీ చేరకపోవడంతో సస్పెండ్ చేశామన్నారు.

Similar News

News November 13, 2024

రైలు ప్రమాద నేపథ్యంలో రైళ్లను దారి మళ్లింపు

image

గూడ్స్ రైలు ప్రమాదం నేపథ్యంలో రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేయగా.. మరికొన్నింటిని దారి మళ్లించింది. రాఘవాపూర్ – రామగుండం మధ్య గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో రైల్వే శాఖ పలు రైళ్లను నిజామాబాద్ మీదుగా మళ్లిస్తూ నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ – సిర్పూర్ కాగజ్ నగర్, సిర్పూర్ కాగజ్ నగర్, సికింద్రాబాద్ రైళ్లను రద్దు చేయగా, మధురై, నిజాముద్దీన్, చెన్నై సెంట్రల్ – లక్నో, పలు రైళ్ల దారి మళ్లించారు.

News November 13, 2024

పెద్దపల్లి: ముమ్మరంగా కొనసాగుతున్న రైల్వే ట్రాక్ పనులు

image

పట్టాలు తప్పిన గూడ్స్ రైలు బోగీలు తొలగించడంతో పాటు ట్రాక్‌పై మరమ్మతు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పెద్దపెల్లి జిల్లా రాఘవపూర్ కన్నాల మధ్యలో గూడ్స్ రైలు పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు భారీ జేసీబీలు తెప్పించే మరమ్మతు పనులు చేపడుతున్నారు. ఇప్పటివరకు మెయిన్ లైన్ రైల్వే ట్రాక్ 600 మీటర్ల వరకు పైగా పూర్తిగా తొలగించినట్లు సమాచారం.

News November 13, 2024

జగిత్యాల: క్యాన్సర్‌తో బీటెక్ విద్యార్థిని మృతి

image

జగిత్యాల జిల్లాలో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. రాయికల్ మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థిని తిరుమల జ్యోత్స్న(18) క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోంది. HYDలోని ఓ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించగా.. అక్కడ మరణించారు. ఆమె మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.