News August 29, 2024

మీర్‌పేట్ చెరువులను పరిశీలించిన హైడ్రా కమిషనర్

image

మీర్‌పేట్ కార్పొరేషన్ పరిధిలోని చందనం చెరువు, మంత్రాల చెరువు, పెద్ద చెరువు మూడు చెరువులు కబ్జాకు గురయ్యాయని స్థానికులు ఇచ్చిన పిర్యాదు మేరకు బుధవారం స్థానిక అధికారులతో కలిసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెరువులను పరిశీలించారు. ఈ సందర్భంగా చెరువులను ఆక్రమించి ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో నిర్మించిన అక్రమ నిర్మాణాలు ఫంక్షన్ హాల్, షాపింగ్ కాంప్లెక్స్‌లను ఆయన పరిశీలించారు.

Similar News

News November 28, 2025

HYD: పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్‌కు విశేష స్పందన

image

హైటెక్స్‌లో 3 రోజులపాటు జరిగిన పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్‌కు దేశ విదేశాల నుంచి యాభై వేల మందికి పైగా సందర్శకులు హాజరై విశేష స్పందన లభించిందని తెలిపారు. పౌల్ట్రీ ఇండియా అధ్యక్షుడు ఉదయ్ సింగ్ బయాస్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం పౌల్ట్రీ రంగానికి అందిస్తున్న సహకారాన్ని అభినందించారు. ముగింపు కార్యక్రమానికి బీజేపీ ఎంపీ లక్ష్మణ్ హాజరయ్యారు. కోడిగుడ్ల ఉత్పత్తిలో 2 స్థానంలో ఉండడం సంతోషం అన్నారు.

News November 28, 2025

HYD: కొడుకుతో కలిసి భర్తను చంపిన భార్య

image

కుమారుడితో కలిసి కట్టుకున్న భర్తనే దారుణ హత్య చేసిందో భార్య. ఈ ఘటన మేడిపల్లి PS పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. బోడుప్పల్ దేవేంద్ర నగర్‌లో నివసించే బండారి అంజయ్య(55) స్కూల్ బస్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మద్యానికి బానిసై భార్య, కుమారుడితో నిత్యం గొడవపడేవాడు. గురువారం రాత్రి వివాదం జరగడంతో కుమారుడు, మరొకరితో కలిసి భార్య అతడిని చంపేసింది. కేసు నమోదైంది.