News March 10, 2025

మీ ఊర్లో నీటి సమస్య ఉందా?

image

ఎండలు రోజురోజుకు పెరుగుతున్నాయి. నంద్యాల జిల్లాలో 36°Cల ఉష్ణోగ్రత నమోదవుతోంది. పలు మున్సిపాలిటీలు, గ్రామాల్లో నీటి సమస్య మొదలవుతోంది. ఈ ఏడాది నీటి ఎద్దడి నివారణకు అధికారులు ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి పంపించారు. జిల్లాలో 457 పంచాయతీలు ఉండగా నిధులు రాగానే ఉండగా సమస్య ఉన్నచోట ట్యాంకర్లతో సరఫరా, బోర్ల మరమ్మతులు, నూతన పైప్‌లైన్ పనులు చేపట్టనున్నారు. మరి మీ ఊర్లో నీటి సమస్య ఉందా? కామెంట్ చేయండి.

Similar News

News February 24, 2026

చరిత్రలో ఈరోజు (ఫిబ్రవరి 24)

image

1911- తెలుగు రచయిత పిలకా గణపతిశాస్త్రి జననం * 1948- తమిళనాడు మాజీ సీఎం జయలలిత జననం * 1951- సాహితీవేత్త, విద్యావేత్త కట్టమంచి రామలింగారెడ్డి మరణం * 1980- ప్రముఖ కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి మరణం * 2018- శ్రీదేవి మరణం(ఫొటోలో) * 1984- నేచురల్ స్టార్ నాని పుట్టినరోజు

News February 24, 2026

KNR: ఆన్‌లైన్ హాల్ టికెట్‌తో అనుమతి

image

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలో 36,426 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. 57 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు జరుగుతాయి. ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా ఆన్‌లైన్ హాల్ టికెట్‌తోనే పరీక్షలకు హాజరుకావచ్చని RIEO గంగాధర్ స్పష్టం చేశారు.

News February 24, 2026

విండీస్ గెలుపుతో టెన్షన్‌లో టీమ్‌ఇండియా

image

T20 WC సూపర్-8లో జింబాబ్వేపై వెస్టిండీస్ 107 పరుగుల భారీ విజయం సాధించడంతో భారత్ సెమీస్ అవకాశాలు క్లిష్టంగా మారాయి. ఇప్పటికే సౌతాఫ్రికాతో ఓడిన ఇండియా ఇప్పుడు తన తదుపరి మ్యాచుల్లో భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. విండీస్ కొట్టిన భారీ స్కోరు, మెరుగైన నెట్ రన్ రేట్ వల్ల భారత్ ఒత్తిడిలో పడింది. ఇకపై జరిగే మ్యాచుల్లో గెలవడమే కాకుండా ఇతర జట్ల ఫలితాలపై కూడా ఇండియా ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.