News October 19, 2024

మీ ఊర్లో ‘పల్లె పండుగ’ జరిగిందా!

image

గ్రామాభివృద్ధే లక్ష్యంగా చేపట్టిన ‘పల్లె పండుగ’ కార్యక్రమం రేపటితో పూర్తవనుంది. ఈ నెల 14 నుంచి గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులకు అధికారులు, నేతలు శంకుస్థాపన చేశారు. ఆగస్టు 23న గ్రామ సభలో ప్రతిపాదించిన పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం ₹4500కోట్లు కేటాయించగా పలుచోట్ల పనులు ప్రారంభమయ్యాయి. మరి మీ ఊర్లో పల్లె పండుగ కార్యక్రమం జరిగిందా? అభివృద్ధి పనులు మొదలయ్యాయా.. కామెంట్ చేయండి..

Similar News

News November 12, 2024

డిసెంబర్‌లోపు జాతీయ రహదారుల పనులు పూర్తి కావాలి: జిల్లా కలెక్టర్

image

అనంతపురం జిల్లాలో NH-544D, NH-67, NH-544DD, NH-42, NH-150A జాతీయ రహదారులకు సంబంధించి వచ్చే డిసెంబర్ నెలాఖరులోపు భూసేకరణ పనులు పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం అనంతపురం కలెక్టర్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో జాతీయ రహదారుల ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. పలు సూచనలు చేశారు.

News November 11, 2024

స్కేటింగ్‌లో ఔరా అనిపిస్తున్న అనంత బుడతడు!

image

స్కేటింగ్‌లో బుడతడు సత్తా చాటుతూ అందరినీ ఔరా.. అనిపిస్తున్నాడు. అనంతపురానికి చెందిన హంజా హుస్సేన్ అనే చిన్నారి 36వ ఇంటర్‌ డిస్ట్రిక్ట్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో రెండు బంగారు, ఒక వెండి పతకాలను సాధించాడు. కాకినాడలో జరిగిన 7 నుంచి 9 ఏళ్ల విభాగంలో అత్యుత్తమ ప్రతిభ చాటడంతో పాటు జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచినట్లు జిల్లా కార్యదర్శి రవి బాల, కోచ్ నాగేంద్ర, హేమంత్ తెలిపారు.

News November 11, 2024

బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా ఉచిత డీఎస్సీ కోచింగ్: మంత్రి సవిత

image

బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా ఉచిత డీఎస్సీ కోచింగ్ ఇస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. సోమవారం సచివాలయంలో మంత్రి మాట్లాడుతూ.. ఈ నెల 16 నుంచి ఉచిత డీఎస్సీ కోచింగ్ ప్రారంభిస్తామని అన్నారు. ఒక్కొక్క కేంద్రంలో 200 మంది అభ్యర్థులకు శిక్షణ ఇస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,200 మందికి శిక్షణ ఇస్తామని, అభ్యర్థులకు నెలకు రూ.1,500 స్టైపండ్ అందజేస్తామన్నారు.