News June 28, 2024

మీ కొత్త MLA నుంచి ఏం ఆశిస్తున్నారు?

image

ఉమ్మడి కర్నూల్ జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు బాధ్యతలు చేపట్టారు. కూటమి సర్కారులో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఏం పనులు చేస్తారోనని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆయా ఎమ్మెల్యేలు ఫోకస్​పెట్టాల్సిన అభివృద్ధి పనులు చాలానే ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా నిలిచిన పనులను పూర్తి చేయాల్సి ఉంది. మరి మీ MLA నుంచి ఏం ఆశిస్తున్నారు? మీ నియోజకవర్గంలో ప్రధాన సమస్యలేంటి? కామెంట్ చేయండి..

Similar News

News December 17, 2025

ఎస్సీ, ఎస్టీ చట్టాలను సమర్థవంతంగా అమలు చేయండి: జేసీ

image

ఎస్సీ, ఎస్టీ చట్టాలను సమర్థవంతంగా అధికారులు అమలు చేయాలని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ అన్నారు. బుధవారం కర్నూలు కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అమలుకు సంబంధించి జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో డీఆర్ఓ వెంకట్ నారాయణమ్మ, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

News December 17, 2025

కర్నూలు ఎస్పీ హెచ్చరిక

image

జిల్లాలో ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు ‘విజిబుల్ పోలీసింగ్‌’ను బలోపేతం చేయాలని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ పోలీసులను ఆదేశించారు. కార్యక్రమంలో భాగంగా వాహనాల తనిఖీలు, సైబర్‌ నేరాలపై అవగాహన, రహదారి భద్రత నియమాల అమలు చేపడుతున్నారు. మైనర్‌ డ్రైవింగ్‌, డ్రంకెన్‌ డ్రైవింగ్‌, సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు సమస్యలు ఎదురైతే డయల్‌ 112 లేదా 100కు సమాచారం ఇవ్వాలన్నారు.

News December 16, 2025

క్రీడల అభివృద్ధికి కృషి చేస్తాం: ఏపీఐఐసీ డైరెక్టర్

image

రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని APIIC డైరెక్టర్ దోమా జగదీశ్ గుప్తా అన్నారు. మంగళవారం కర్నూలులోని సిల్వర్ జూబ్లీ కళాశాల మైదానంలో కర్నూలు జిల్లా నెట్ బాల్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా నెట్ బాల్ సీనియర్ క్రీడాకారుల ఎంపిక పోటీలను జిల్లా అధ్యక్షుడు నాగేశ్వర బాబుతో కలిసి ప్రారంభించారు. నగరాన్ని స్పోర్ట్స్ సిటీగా తీర్చేందుకు మంత్రి కృషి చేస్తున్నారన్నారు.