News July 22, 2024
మీ MLA ఏ సమస్యపై ప్రస్తావించాలనుకుంటున్నారు?

నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉమ్మడి జిల్లాలోని అరకు, పాడేరు, విశాఖ వెస్ట్ ఎమ్మెల్యేలు తొలిసారి అసెంబ్లీలో గళం వినిపించనున్నారు. పాయకరావుపేట MLA అనిత హోం మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గంటా, బండారు, కొణతాల వంటి మాజీ మంత్రులు.. KSN రాజు, పల్లా వంటి సీనియర్లు ఉన్నారు. మరి మీ MLA అసెంబ్లీలో ఏ సమస్యపై ప్రస్తావించాలనుకుంటున్నారో కామెంట్ చెయ్యండి.
Similar News
News November 22, 2025
తాటిచెట్లపాలెం: బస్సు చక్రాల కింద పడి వ్యక్తి మృతి

తాటిచెట్లపాలెం జంక్షన్ వద్ద రోడ్డు దాటుతున్న వ్యక్తిని శనివారం రాత్రి బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సు చక్రాల కింద పడటంతో తల నుజ్జునుజ్జయింది. మృతుడి వయస్సు 70 సంవత్సరాలు వయసు పైబడి ఉంటుంది. ఫోర్త్ టౌన్ ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతుని వివరాలు ఆరా తీస్తున్నారు.

విశాఖలో కాంగ్రెస్ ప్రక్షాళన: డీసీసీ ఎన్నికలకు సన్నాహాలు

విశాఖలో డీసీసీ అధ్యక్షురాలు హాసిని వర్మ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఏఐసీసీ పరిశీలకులు హాజరయ్యారు. అధిష్టానం జిల్లాకో పరిశీలకుడిని నియమించిందని, త్వరలో డీసీసీ ఎన్నికలు నిర్వహించి అభ్యర్థుల ఎంపిక బాధ్యతలను కమిటీలకే అప్పగిస్తామని తెలిపారు. పార్టీకి పూర్వవైభవం తెచ్చి, రాబోయే ఎన్నికల్లో జీవీఎంసీపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ ప్రియాంక దండి ధీమా వ్యక్తం చేశారు.