News March 29, 2024
ముండ్లమూరు: రెండు బైకులు ఢీ.. స్పాట్ డెడ్
రెండు బైకులు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన శుక్రవారం వేంపాడు-పెద్ద రావిపాడులో జరిగింది. వేంపాడుకు చెందిన గోపనబోయిన రామారావు(40) తన మిర్చి పొలంలోని కూలీలకు టిఫిన్ తీసుకుని బైకుపై ముండ్లమూరు నుంచి వస్తున్నారు. అదే సమయంలో రావిపాడుకు చెందిన ఉలవ మల్లికార్జున తన బైకుపై వస్తూ మలుపు వద్ద ఇరువురు ఢీకొన్నారు. రామారావు చనిపోగా, మల్లికార్జున గాయపడ్డారు. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు.
Similar News
News January 22, 2025
ప్రకాశం: తమ్ముడి మృతి.. 12 ఏళ్లకు అన్నకు ఉద్యోగం
మరణించిన తమ్ముడి ఉద్యోగాన్ని కారుణ్య నియామకం కింద ఆయన అన్నకి ఇచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. కో-ఆపరేటివ్ డిపార్ట్మెంట్‌లో పనిచేస్తూ ప్రమాదవశాత్తు మరణించిన నావూరి రామకృష్ణ మరణానంతరం 12 ఏళ్ళ తరువాత రామకృష్ణ అన్న ఏడుకొండలుకు కారుణ్య నియామకం కింద ఉద్యోగ ఉత్తర్వులు ఇచ్చారు. మంగళవారం ప్రకాశం కలెక్టర్ తమీమ్ అన్సారియా ఏడుకొండలుకు ఉత్తర్వుల్ని ఇచ్చారు.
News January 22, 2025
ఒంగోలు రానున్న వందేమాతరం శ్రీనివాస్
అక్కినేని నాగేశ్వరరావు 11వ వర్ధంతి కార్యక్రమాన్ని 22వ తేదీ ఒంగోలులోని సీవీఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో నిర్వహించనున్నారు. ఈ మేరకు అక్కినేని కళాపరిషత్ అధ్యక్షుడు కళ్ళగుంట కృష్ణయ్య ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు వందేమాతరం. శ్రీనివాస్‌కు నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు అవార్డు -2025ను ప్రదానం చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమానికి ఎంపీ, ఎమ్మెల్యే హాజరవుతారని తెలిపారు.
News January 21, 2025
కొండపిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్‌డెడ్
కొండపిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అద్దంకి(M) శంకరాపురానికి చెందిన దుర్గారావు, చిరంజీవి, ఆమీన్‌లు కామేపల్లి పోలేరమ్మను దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. కొండపి JL కోల్డ్ స్టోరేజ్ దగ్గర కట్టెల ట్రాక్టర్ వారి బైక్‌ను ఢీకొనడంతో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. ఆమీన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని ఒంగోలు రిమ్స్ కు తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.