News March 30, 2025
ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన జనగామ కలెక్టర్

రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు జనగామ జిల్లా కలెక్టర్ ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్రమైన రంజాన్ మాసం శాంతి, సామరస్యం, ఐక్యతను కలిగించాలని ఆకాంక్షించారు. ప్రజలు ప్రేమ, సహనంతో ఉండాలని, సమాజ అభివృద్ధికి కృషి చేయాలని ఆయన సందేశంలో పేర్కొన్నారు. నెల రోజుల పాటు ముస్లిం సోదరులు కఠినమైన నియమ నిష్టలతో ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాసాన్ని కొనసాగిస్తారని తెలిపారు.
Similar News
News November 23, 2025
సత్యవేడు: ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

శ్రీసిటీ వద్ద ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ IIITలో 2026 సంవత్సరానికి సంబంధించి MS (Research)లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు కార్యాలయం పేర్కొంది. 3 విభాగాలలో కోర్సులు అందుబాటులో ఉన్నట్లు తెలియజేశారు. ఆసక్తి కలిగిన వారు https://iiits.ac.in/admissions/ms-research-programme/ వెబ్ సైట్ చూడాలని సూచించారు.
News November 23, 2025
హనుమకొండ: బహుమతులను అందజేసిన మంత్రి, ఎమ్మెల్యేలు

11వ తెలంగాణ స్టేట్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ 2025-26 పోటీల్లో గెలుపొందిన విజేతలకు మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, నాగరాజు, స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనారెడ్డి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కుడా ఛైర్మన్ వెంకటరామిరెడ్డి, అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
News November 23, 2025
ఏలూరు కలెక్టరేట్లో సత్యసాయి జయంతి ఉత్సవాలు

ఏలూరులోని గౌతమీ సమావేశ మందిరంలో ఆదివారం శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ కె.వెట్రిసెల్వి, డీఆర్ఓ వి.విశ్వేశ్వరరావు హాజరై.. బాబా చిత్రపటానికి పూలమాలలు వేశారు. మనుషుల్లో ప్రేమ ఉన్నంతకాలం సత్యసాయి బాబా మన మధ్యే ఉంటారని, ఆయన చూపిన సేవా మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.


