News June 28, 2024
ముంపు గ్రామాల్లో అప్రమత్తం: మంత్రి అనిత

వరదల సమయంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గోదావరి ముంపు గ్రామాల్లో ముందస్తు నివారణ చర్యలు చేపట్టి అధికారులు అప్రమత్తంగా ఉండాలని హోం, విపత్తుల నిర్వహణ మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. శుక్రవారం అమరావతి నుంచి జిల్లా కలెక్టర్తో వరద నివారణ చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని దేవీపట్నం మండలంలో వరద నివారణ చర్యలపై ప్రత్యేకంగా కలెక్టర్ను అడిగి తెలుసుకున్నారు.
Similar News
News December 5, 2025
ఒత్తిడికి లోనుకాకుండా చదవాలి: కలెక్టర్

తాళ్లపూడి మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం నిర్వహించిన మెగా PTM 3.0ను కలెక్టర్ కీర్తి చేకూరి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె అన్నదేవరపేట ప్రభుత్వ ఎలిమెంటరీ స్కూల్, అన్నదేవరపేట ప్రభుత్వ హైస్కూల్, వేగేశ్వరపురం ప్రభుత్వ హైస్కూల్లను సందర్శించారు. విద్యార్థులతో ముచ్చటించిన కలెక్టర్.. ఒత్తిడికి లోనుకాకుండా చదవాలని, వెనుకబడిన సబ్జెక్టుల్లో ప్రత్యేక తరగతులకు హాజరు కావాలని విద్యార్థులకు సూచించారు.
News December 5, 2025
రాజమండ్రి: 5000 కెమెరాలు..17 డ్రోన్లతో నిఘా

తూర్పుగోదావరి జిల్లా పరిధిలో 5 వేల సీసీ కెమెరాలు, 17 డ్రోన్ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేయడం ద్వారా నేరాలను అదుపు చేయగలిగామని ఎస్పీ డి. నరసింహ కిషోర్ తెలిపారు. గత 11 నెలల కాలంలో 1137 డ్రంక్ అండ్ డ్రైవ్, 399 పేకాట, 242 కోడి పందాలు, 126 సారా, 49 గంజాయి కేసులు నమోదు చేశామన్నారు. అదృశ్యమైన 136 మంది బాలికల్లో 133 మందిని గుర్తించామని ఎస్పీ పేర్కొన్నారు.
News December 5, 2025
రాజమండ్రిలో నిలిచిన విమాన సర్వీసులు

పైలట్ల సమ్మె కారణంగా మధురపూడి విమానాశ్రయంలో సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మూడు రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. గురువారం హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు, 3.30 గంటలకు రావాల్సిన విమానాలు రద్దయ్యాయి. దీంతో ఇక్కడ నుంచి బయలుదేరాల్సిన రిటర్న్ సర్వీసులను అధికారులు నిలిపివేశారు. అలాగే దిల్లీ, హైదరాబాద్ నుంచి రావాల్సిన పలు సర్వీసులు సుమారు 4 గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి.


