News June 28, 2024

ముంపు గ్రామాల్లో ముందు జాగ్రత్త చర్యలు: హోం మంత్రి

image

ముంపు గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని హోంమంత్రి వంగలపూడి అనిత సూచించారు. భారీవర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో శుక్రవారం వీసీ నిర్వహించారు. ప్రస్తుతం అల్లూరి జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. వరద ముంపు గ్రామాల్లో జిల్లా, రెవెన్యూ అధికారులను అప్రమత్తం చేశామన్నారు. ప్రజలను వరదల పట్ల చైతన్యం చేస్తున్నామన్నారు.

Similar News

News October 18, 2025

బీచ్‌లో లైట్లు ఏవి..? అధికారులపై మేయర్ ఆగ్రహం

image

విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు శనివారం రాత్రి ఆర్కే బీచ్ పరిసరాలను పరిశీలించారు. బీచ్‌లో విద్యుత్‌ లైట్లు ఏర్పాటు చేయనందుకు ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు నెలల క్రితమే ఆదేశించినా చర్యలు తీసుకోలేదని మేయర్‌ విమర్శించారు. బీచ్‌లో హైమాస్ట్‌ లైట్లు వెలగక సందర్శకులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అలాగే పరిశుభ్రతపై శ్రద్ధ వహించి, బీచ్‌ అందాన్ని కాపాడాలని సూచించారు.

News October 18, 2025

విశాఖ-పార్వతీపురం మధ్య స్పెషల్ ట్రైన్

image

దీపావళి రద్దీ దృష్య్టా ఈనెల 27 వరకు విశాఖ-పార్వతీపురం మధ్య మెము స్పెషల్ ట్రైన్ నడవనుంది. విశాఖలో ఉ.10కు బయలుదేరి పార్వతీపురం మ.12.20కు చేరుకుంటుంది. తిరిగి పార్వతీపురంలో మ.12.45కు బయలుదేరి బొబ్బిలి 1.10కు చేరుకుని విశాఖ సా.4గంటలకు వెళ్లనుంది. సింహాచలం, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, గజపతినగరం, కోమటిపల్లి, డొంకినవలస, బొబ్బిలి, సీతానగరంలో ఆగనుంది. > Share it

News October 18, 2025

ఆటోలు గుద్దుకున్నా ఛలో పోలీస్ స్టేషన్ అంటారేమో: విష్ణుకుమార్ రాజు

image

వైసీపీ స్థితిని చూస్తే బాధ కలుగుతోందని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. రెండు ఆటోలు గుద్దుకున్నా ఛలో పోలీస్ స్టేషన్ అనే స్థాయికి దిగిపోయిందని ఎద్దేవా చేశారు. వైజాగ్ ఐటీ, ఐటీ అనుబంధ రంగాలకు బెస్ట్ డెస్టినేషన్ అవుతుందన్నారు. అదానీకి భూములు ధారాదత్తం చేసిన ఘనత వైసీపీకే దక్కుతుందన్నారు. గూగుల్ డేటా సెంటర్ వల్ల ప్రత్యక్షంగా 2వేల ఉద్యోగాలు, పరోక్షంగా వేలాది మంది ఉపాధి పొందుతారని వెల్లడించారు.