News August 29, 2024
ముంబై నటి జెత్వానీ కేసుపై హోంమంత్రి స్పందన

ముంబై నటి జెత్వానీ కేసుపై హోంమంత్రి అనిత స్పందించారు. విజయవాడలో ఆమె మాట్లాడుతూ.. బాధితురాలు ఆన్లైన్లో ఫిర్యాదు చేశారన్నారు. విచారణ కోసం మహిళా అధికారిని నియమించినట్లు తెలిపారు. తప్పుచేస్తే అధికారులతో సహా ఎవరినీ వదిలిపెట్టం అని వెల్లడించారు. బాధితురాలికి న్యాయం చేస్తాం అని పేర్కొన్నారు. దిశ పీఎస్లను మహిళా పీఎస్లుగా వినియోగిస్తాం ఆమె సృష్టం చేశారు.
Similar News
News January 8, 2026
కృష్ణా: ఫాస్ట్ ఫుడ్ వీడి.. చిరుధాన్యాల వైపు జనం మొగ్గు.!

మెట్రో నగరాలకే పరిమితమైన ‘మిల్లెట్స్’ ట్రెండ్ ఇప్పుడు చిన్న పట్టణాలకూ విస్తరించింది. ఆరోగ్యంపై పెరిగిన అవగాహనతో ప్రజలు ఫాస్ట్ ఫుడ్ కంటే పౌష్టికాహారానికే మొగ్గు చూపుతున్నారు. మచిలీపట్నం, గుడివాడ, పెడన తదితర ప్రాంతాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా చిరుధాన్యాల మొలకలు, మిల్లెట్ టిఫిన్లు, ఫ్రూట్ సలాడ్స్ స్టాల్స్ కనిపిస్తున్నాయి. బస్టాండ్లు, పార్కులు, వాకింగ్ ట్రాక్ల వద్ద ఉదయం ఈ స్టాళ్ల వద్ద రద్దీ పెరిగింది.
News January 7, 2026
ఆత్కూరులో ట్యాలీ కోర్సులో ఉచిత శిక్షణ

నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్ట్లో ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి ట్యాలీ కోర్సులో శిక్షణ ప్రారంభం కానుంది. శిక్షణ కాలంలో అభ్యర్థులకు ఉచిత వసతితో పాటు పౌష్టికాహారాన్ని ట్రస్టు నిర్వాహకులు కల్పిస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ వివరాలను నమోదు చేసుకోవాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News January 6, 2026
ఎరువుల వినియోగంపై అవగాహన అవసరం: కలెక్టర్

ఆరోగ్యకరమైన పంటల సాగుకు రైతులు ఎరువులను విచక్షణతో వినియోగించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ డీ.కే. బాలాజీ అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో నిర్వహించిన ధర్తీ మాత బచావో నిగ్రాన సమితి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులు అనవసరంగా రసాయన ఎరువులు వాడకుండా నియంత్రించే బాధ్యత వ్యవసాయ శాఖ, వ్యవసాయ శాస్త్రవేత్తలపై ఉందని తెలిపారు.


