News March 19, 2025
ముకుంద జువెలర్స్ వార్షికోత్సవ వేడుకలు

ముకుంద జువెలర్స్ కూకట్‌పల్లి బ్రాంచ్ 2వ వార్షికోత్సవం, కొత్తపేట బ్రాంచ్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా సంస్థ ఉద్యోగులకు బహుమతులు ప్రదానం చేశారు. రెండు సంవత్సరాల్లోనే 6 బ్రాంచులు స్థాపించడం సంతోషంగా ఉందని, కస్టమర్ల నమ్మకమే తమ సంస్థ అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. సేల్స్ పెంచిన ఉద్యోగులకు కార్లు, బైకులు, టీవీలు, ఎలక్ట్రానిక్ వస్తువులు బహుమతిగా అందజేశారు.
Similar News
News October 19, 2025
‘ఆట’ విడుపు.. క్రికెట్‌తో సేదదీరిన హైడ్రా సిబ్బంది

హైడ్రా సిబ్బంది శనివారం ఫతుల్‌గూడలోని క్రీడామైదానంలో ఫ్లడ్‌లైట్ల కాంతిలో క్రికెట్ ఆడుతూ సేదతీరారు. అసెట్స్ ప్రొటెక్షన్, డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగాల మధ్య జట్ల పోటీ ఉత్సాహంగా సాగింది. కమిషనర్ రంగనాథ్, అదనపు కమిషనర్లు అశోక్ కుమార్, సుదర్శన్, డైరెక్టర్ వర్ల పాపయ్య పాల్గొన్నారు. క్రీడలు జట్టు స్ఫూర్తిని పెంచుతాయని కమిషనర్ అన్నారు.
News October 19, 2025
HYD: సింగిల్స్‌ను టెంప్ట్ చేస్తున్నారు.. మోసపోకండి!

వాట్సప్‌నకు వచ్చే లింకులు, APKలతో జాగ్రత్త! సింగిల్స్‌ను టెంప్ట్ చేసేందుకు ఇటీవల కేటుగాళ్లు అశ్లీల వీడియోలు అంటూ APKఫైల్ పంపుతున్నారు. దీనిమీద క్లిక్ చేస్తే మెయిల్, గ్యాలరీ, పేమెంట్ యాప్స్ వాళ్ల చేతిలోకి వెళ్లిపోతాయని HYD సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు. ఇటీవల నగరంలోని ఓ వ్యక్తికి వాట్సప్‌లో ఈ ఫైల్ రాగా.. తన కొడుకుకి చూపిచడంతో వెంటనే ఆ నంబర్ బ్లాక్ చేసి వాట్సప్‌నకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
News October 19, 2025
HYD: యూట్యూబర్లపై సైబర్ క్రైమ్ కొరడా

మైనర్లతో అసభ్యకరమైన కంటెంట్ ప్రచురించినందుకు గాను రెండు యూట్యూబ్ ఛానెళ్లపై POCSO చట్టం కింద కేసు నమోదైంది. నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సోషల్ మీడియాలో స్వేచ్ఛ ఉంది కదా అని చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీస్ శాఖ హెచ్చరించింది.