News January 27, 2025

ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన MLA కడియం

image

స్టే.ఘనపూర్ మున్సిపాలిటీగా అధికారికంగా అమల్లోకి రావడానికి సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా మంత్రులకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ పాలనలోనే స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీగా మారుతుందనుకున్న ప్రజల కళ ఏడేళ్ల తర్వాత నేడు నెరవేరింది. ఇక స్టేషన్ ఘనపూర్ అభివృద్ధిలో దూసుకుపోతుందని అంటూ మూడు గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News February 26, 2026

పెద్దన్నను కాదని భారత్‌కు ఇజ్రాయెల్ సాయం

image

దౌత్య సంబంధాలు లేని 1971లోనే అమెరికాను ఎదిరించి మరీ భారత్‌కు ఇజ్రాయెల్ రహస్యంగా ఆయుధాలు, శిక్షణ అందించింది. 1980లలో పాక్ అణు కేంద్రాన్ని ధ్వంసం చేసేందుకూ ఆఫర్ ఇచ్చింది. ఇటీవల ‘ఆపరేషన్ సిందూర్’కూ ఇజ్రాయెల్ పూర్తి మద్దతు ప్రకటించింది. ఐక్యరాజ్యసమితిలో వాషింగ్టన్ కంటే ఢిల్లీనే ఎక్కువగా నమ్ముతామని నెతన్యాహు గతంలో ప్రకటించారు. రక్షణ, వ్యవసాయం, AI రంగాల్లో ఇరు దేశాల సహకారం ఇప్పుడు మరింత బలోపేతమైంది.

News February 26, 2026

IND Vs ZMB: గెలిస్తేనే సెమీస్ రేసులో ఇండియా

image

T20 WC S-8లో భాగంగా నేడు 2 కీలక మ్యాచ్‌లు జరగనున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు అహ్మదాబాద్‌లో సౌతాఫ్రికా, వెస్టిండీస్ తలపడనున్నాయి. రాత్రి 7 గంటలకు చెన్నైలో భారత్, జింబాబ్వే ఢీకొంటాయి. తొలి మ్యాచ్‌లో SA చేతిలో ఓడిన ఇండియా సెమీస్ చేరాలంటే ఈ మ్యాచ్‌లో మంచి నెట్ రన్ రేట్‌తో గెలవడం తప్పనిసరి. లేదంటే రేసు నుంచి దాదాపు తప్పుకొన్నట్లే. అటు వెస్టిండీస్, SA ఇప్పటికే చెరో విజయంతో పాయింట్ల పట్టికలో ముందున్నాయి.

News February 26, 2026

కాలం చెల్లిన పదార్థాలు వాడొద్దు: కలెక్టర్

image

విద్యార్థులకు అందించే భోజనం నాణ్యంగా ఉండాలని, రాజి పడొద్దని, కాలం చెల్లిన వస్తువులు వాడద్దని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. సిద్దిపేట రూరల్ మండలం కస్తూర్బా బాలికల విద్యాలయాన్ని మధ్యాహ్నం భోజన సమయంలో సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్టాక్ రిజిస్టర్ వెరిఫై చేసి పొంతన లేకుండా ఉండటంతో ఎస్ఓపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చర్యలు తీసుకోవాలని డీఈఓను ఫోన్ ద్వారా ఆదేశించారు.