News August 8, 2024
ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోసం వినతి పత్రం
పారామిలిటరీ (CAPFS) మాజీ సైనికుల బృందం నిన్న టీడీపీ కేంద్ర కార్యాలయంలో తమ సమస్యలను వివరించి వాటి పరిష్కారానికి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుని కలవడానికి అపాయింట్మెంట్ కోరుతూ శ్రీ కేఎస్ జవహర్, మాజీ మంత్రిని కలిసి విజ్ఞాపన పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీ ప్రభాకర్, శ్రీ ఏడుకొండలు, శ్రీ సుబ్బారావు, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News September 9, 2024
జంగారెడ్డిగూడెంలో యాక్సిడెంట్.. మృతిచెందింది ఇతనే
జంగారెడ్డిగూడెం మండలం వేగవరం హైవేలో ఆదివారం రాత్రి జరిగిన <<14055637>>రోడ్డు ప్రమాదంలో<<>> ఓ యువకుడు మృతిచెందిన విషయం తెలిసిందే. వివరాలు.. మండలంలోని వేగవరం గ్రామానికి చెందిన బూరుగు మోహన్ కృష్ణ తాడువాయి సచివాలయ పరిధిలో అసిస్టెంట్ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కాగా ఆదివారం జంగారెడ్డిగూడెం నుంచి వేగవరం వస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు లారీని ఢీకొని మృతి చెందాడు.
News September 9, 2024
ఏలూరు: అర్ధరాత్రి యాక్సిడెంట్.. వ్యక్తి మృతి
ఏలూరు జిల్లా భీమడోలు మండలం కురెళ్లగూడెం వద్ద 216వ జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. విజయవాడ నుంచి తాడేపల్లిగూడెం వైపు బత్తాయి లోడుతో వెళ్తున్న లారీ స్థానిక కురెళ్లగూడెం పెట్రోల్ బంక్ సమీపంలో బైక్ మీద ఉంగుటూరుకి చెందిన పిల్లా విష్ణును ఢీ కొంది. దీంతో అతను అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
News September 9, 2024
ఏలూరు: వాగు దాటుతూ లెక్చరర్ మృతి
ఏలూరు జిల్లా లింగపాలెం మండలంలో ఆదివారం విషాదం జరిగింది. మండలంలోని చిలకరాయుడు పాలేనికి చెందిన సూర్యప్రకాశ్ చాట్రాయి మండలం తుమ్మగూడెం వద్ద వాగు దాటుతుండగా ప్రమాదవశాత్తూ మృతి చెందాడు. ఏలూరులోని ఓ కాలేజీలో ఎకనామిక్స్ లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. సూర్యప్రకాష్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.