News August 8, 2024

ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన ఆయన వీరాభిమానులు

image

ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ ఊరు పర్యటనకు వెళ్లినా అక్కడ తమ స్కూటీతో ప్రత్యక్షమయ్యే వీరాభిమానులు గురువారం ఆయన్ను కలిశారు. దెందులూరుకు చెందిన దుర్గాదేవి, వినుకొండకు చెందిన శివరాజు యాదవ్‌లను సీఎం నేడు పిలిపించుకున్నారు. వారిని ఆప్యాయంగా పలకరించి వారి కుటుంబ నేపథ్యాన్ని వాకబు చేశారు. సాక్షాత్తూ తమ అభిమాన నాయకుడు నేరుగా తమతో మాట్లాడటంతో దుర్గా, శివరాజు యాదవ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Similar News

News April 10, 2026

గుంటూరు కలెక్టర్ పేరుతో నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్..!

image

గుంటూరు కలెక్టర్ అధికారిక ఫేస్‌బుక్ పేజీ District Collector Guntur మాత్రమే అని అధికారులు వెల్లడించారు. CM Saikanth Varma las పేరుతో ఉన్నది నకిలీ అకౌంట్‌గా గుర్తించినట్లు తెలిపారు. ప్రజలు గమనించి మోసపోవద్దని, ఆ అకౌంట్‌ను అనుసరించవద్దని సూచించారు. అనుమానాస్పద అకౌంట్లపై వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని కోరారు. ఫేక్ ఐడీలపై అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

News April 10, 2026

సీనియర్ T-20 గుంటూరు జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక

image

ఈ నెల 11 నుంచి 14 వరకు మూలపాడులో నిర్వహించనున్న ACA సీనియర్ T-20 మెన్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ పోటీలకు గుంటూరు జిల్లా సీనియర్ జట్టు ఎంపికైంది. క్రీడాకారులు షేక్‌ రషీద్(C), మహీప్, వంశీకృష్ణ(WC), అఖిల్, సిద్దార్థ్, ప్రణయ్ కుమార్, సమన్విత్, షేక్‌ అస్లాం బేగ్, రేవంత్ కుమార్, సిద్దు కార్తీక్ రెడ్డి, ఆకాశ్, షేక్.తౌఫిక్, మనోహర్, జయచంద్రకేశవ్, షేక్.బాజీ ఎంపికయ్యారు. మరో ఆరుగురు స్టాండ్ బైస్ ఉన్నారు.

News April 9, 2026

గుంటూరు: ఎస్పీలుగా పలువురి పేర్లు పరిశీలన

image

గుంటూరు జిల్లాలో పలువురు అదనపు ఎస్పీలకు ఎస్పీలుగా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. డీజీపీ కార్యాలయం విడుదల చేసిన ఎస్పీల ప్యానెల్ జాబితాలో గుంటూరులో పనిచేస్తున్న పలువురు అదనపు ఎస్పీల పేర్లు ఉన్నాయి. గుంటూరు క్రైమ్స్ అదనపు ఎస్పీ కే. సుప్రజ, ఎల్ అండ్ ఓ అదనపు ఎస్పీ ఏ.టీ.వి రవికుమార్, అడ్మిన్ అదనపు ఎస్పీ జీ.వీ. రమణమూర్తి పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. వీరికి త్వరలో ఎస్పీలుగా పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉంది.