News October 3, 2024

ముఖ్యమంత్రి చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే.!

image

ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. మధ్యాహ్న 12 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి సచివాలయానికి వెళతారు. అనంతరం అక్కడ జీఎస్‌డీపీ వృద్ధిపై సమీక్ష చేస్తారు. సాయంత్రం ఐ అండ్ పీఆర్ శాఖపై, ఆ తర్వాత నెలవారీ గ్రీవెన్స్‌ల పరిష్కారంపై రివ్యూ చేస్తారని చెప్పారు.

Similar News

News November 7, 2024

వీవీఐటీలో మంత్రి నారా లోకేశ్ సందడి

image

అమరావతిలోని వీఐటీ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫెయిర్‌లో మంత్రి లోకేశ్ ఆద్యంతం సందడి చేశారు. ముందుగా వర్సిటీ చేరుకున్న మంత్రి  లోకేశ్‌కు విశ్వవిద్యాలయ నిర్వాహకులు, సిబ్బంది, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి ఎడ్యుకేషన్ ఫెయిర్‌ను రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. 

News November 7, 2024

TDP కార్యకర్తను చంపేందుకు కుట్ర: యాగంటి

image

దుర్గి మండలానికి చెందిన టీడీపీ కార్యకర్త గోకుల గౌరీ యాదవ్ ను శ్యామరాజపురం, జమ్మలమడక గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు హత్య చేసేందుకు 2 రోజుల క్రితం కుట్ర పన్నారని మాచర్ల మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్ యాగంటి మల్లికార్జునరావు ఆరోపించారు. బాధితుడిని గురువారం పరామర్శించి మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో MLA జూలకంటి బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో ఇలాంటి హత్యా రాజకీయాలకు వైసీపీ వారు పాల్పడితే తాట తీస్తామన్నారు.

News November 7, 2024

మేరుగు నాగార్జునపై అత్యాచారం కేసులో BIG TWIST

image

మాజీ మంత్రి మేరుగు నాగార్జునపై అత్యాచారం కేసు ఊహించని మలుపు తిరిగింది. మేరుగుపై రాజకీయ ఒత్తిడితో తప్పుడు చేసు కేసు పెట్టానని బాధిత మహిళ హైకోర్టులో తెలిపింది. కేసు కొట్టేయాలని బాధిత మహిళ న్యాయవాది కోర్టును ఆశ్రయించారు. ఫిర్యాదు చేసిన వారు కోరిన వెంటనే కేసు కొట్టివేయలేమని, ఫిర్యాదు చేసిన వారు కూడా దీనిపై పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, ఈనెల 12కి కేసు వాయిదా వేస్తున్నట్లు కోర్టు తెలిపింది.