News November 29, 2024

ముఖ్యమంత్రి చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే.!

image

ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. ఉదయం 11.15 గంటలకు నారావారిపల్లె నుంచి సచివాలయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాల సాధనపై తదుపరి కార్యాచరణపై చర్చిస్తారు. 3.30 గంటలకు రెవెన్యూ శాఖపై సమీక్ష చేసిన అనంతరం గ్రామ/వార్డు సచివాలయాల పునర్ వ్యవస్థీకరణపై సమీక్ష చేయనున్నట్లు చెప్పారు.  

Similar News

News October 17, 2025

GNT: అంగన్‌వాడీ అద్దె బకాయిలు రెండు రోజుల్లో జమ

image

గుంటూరు జిల్లాలోని ప్రైవేటు భవనాల్లో నడుస్తున్న అంగన్‌వాడీ కేంద్రాల అద్దె బకాయిలను రెండు రోజుల్లోకార్యకర్తల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి పి.వి.జి. ప్రసున తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే బకాయిల విడుదలకు బడ్జెట్‌ను విడుదల చేసిందని ఆమె పేర్కొన్నారు. ఈ విషయంపై సిబ్బందికి తెలియజేయాలని అధికారులను ఆదేశించినట్లు వివరించారు.

News October 16, 2025

అమరావతి రైతులకు ముఖ్య సూచన

image

అమరావతిలో రైతులు, రైతు కూలీల సమస్యల పరిష్కారం కోసం తుళ్లూరులోని CRDA కార్యాలయంలో శుక్రవారం గ్రీవెన్స్ డే నిర్వహించనున్నట్లు అడిషనల్ కమిషనర్ భార్గవ్ తేజ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే గ్రీవెన్స్ డేను రైతులు, అమరావతి ప్రాంతవాసులు వినియోగించుకోవాలని ఆయన కోరారు. భూములిచ్చిన రైతుల సమస్యలను “గ్రీవెన్స్ డే” ద్వారా CRDA అధికారుల దృష్టికి తీసుకురావొచ్చు అని అన్నారు.

News October 16, 2025

గుంటూరు జిల్లాలో 173 న్యూసెన్స్ కేసులు: ఎస్పీ

image

గుంటూరు జిల్లా వ్యాప్తంగా నైట్ టైమ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా నైట్ టైమ్‌లో అనవసరంగా తిరుగుతున్న 181 మందిపై 173 న్యూసెన్స్ కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ఓపెన్ డ్రింకింగ్, రోడ్లపై అనవసరంగా తిరుగుతూ, ప్రజల భద్రతకు భంగం కలిగించే వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు.