News December 7, 2024

ముఖ్యమంత్రి చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే..!

image

సీఎం చంద్రబాబు శనివారం షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. ఉదయం 10 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి బాపట్ల చేరుకుంటారు. పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఉండవల్లి నివాసానికి చంద్రబాబు వస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి విజయవాడలో పలు కార్యక్రమంలో పాల్గొని, తిరిగి రాత్రికి హైదరాబాద్‌లోని నివాసానికి వెళతారు.  

Similar News

News January 6, 2026

GNT: నేడు సీఆర్డీఏ అథారిటీతో సీఎం సమావేశం

image

అమరావతి ప్రాంతంలో జరుగుతున్న నిర్మాణ పనులు ఇతర విషయాలపై CRDA అథారిటీతో CM చంద్రబాబు మంగళవారం సమావేశం కానున్నారు. ముందుగా మంత్రి నారాయణ CRDA అధికారులతో సమీక్ష నిర్వహించి, మధ్యాహ్నం 2:30 నిమిషాలకు సచివాలయంలో జరిగే అథారిటీ సమావేశంలో చర్చించనున్నారు. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు అమరావతి రైతుల సమస్యల త్రిసభ్య కమిటీతో CM భేటి కానున్నారు. సాయంత్రం 4 గంటలకు తీసుకున్న నిర్ణయాలు మంత్రి నారాయణ వెల్లడిస్తారు.

News January 5, 2026

తెనాలి సబ్ కలెక్టర్ గ్రీవెన్స్‌కు 7 ఫిర్యాదులు

image

తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్‌కు 7 ఫిర్యాదులు వచ్చాయి. సబ్ కలెక్టర్ సంజనా సింహ వేరే అధికారిక కార్యక్రమానికి వెళ్లడంతో కార్యాలయ అధికారులే ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ 1, మున్సిపాలిటీ 2, దేవాదాయ శాఖ 1, పంచాయతీ రాజ్ విభాగానికి 3 అర్జీలు చొప్పున మొత్తం 7 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. వాటిని ఆయా విభాగాలకు పంపి పరిష్కరిస్తామని తెలియజేశారు.

News January 5, 2026

GNT: సీఎం చంద్రబాబు నేటి షెడ్యూల్

image

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం గుంటూరులో పర్యటించనున్నారు. ఉదయం 10:35 గంటలకు గుంటూరులోని శ్రీ సత్యసాయి స్పిరిచ్యువల్ సిటీకి చేరుకుంటారు. అక్కడ 10:45 గంటలకు జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12:50 గంటలకు సచివాలయానికి వస్తారు. సాయంత్రం 4:30 గంటలకు ఆర్టీజీఎస్‌పై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం 6:30 గంటలకు నివాసానికి చేరుకుంటారు.