News April 10, 2025

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

image

ఈనెల 11న ఆగిరిపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో నూజివీడులోని సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం రాత్రి ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సీఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.  కలెక్టర్ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులంతా సమన్వయంతో పనిచేసి సీఎం పర్యటనను విజయవంతం చేయాలన్నారు. జేసీ ధాత్రి రెడ్డి, ఎస్పీ కెపీఎస్ కిషోర్  పాల్గొన్నారు.

Similar News

News December 7, 2025

కృష్ణా: వసతి గృహాల పర్యవేక్షణకు యాప్

image

వసతి గృహాల నిర్వహణలో పారదర్శకత, నాణ్యత పెంచేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో HPTS అనే ప్రత్యేక యాప్‌ను అభివృద్ధి చేసింది. ఈ యాప్ ద్వారా అధికారులు వసతి గృహాల్లోని సేవలను నిరంతరం పర్యవేక్షించవచ్చు. రోజువారీ, వారాంతపు నిర్వహణ పనులను తప్పనిసరిగా ఈ యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది.

News December 7, 2025

ANU పరీక్షల్లో డిజిటల్ విధానం.. ప్రశ్నపత్రాల లీకేజీకి చెక్

image

ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనలను అరికట్టేందుకు ఆచార్య నాగార్జున వర్సిటీ (ANU) డిజిటల్ విధానాన్ని ప్రారంభించింది. ఇకపై పరీక్షా కేంద్రాలకు పాస్‌వర్డ్ ఉన్న సీడీల్లోనే ప్రశ్నపత్రాలు పంపనున్నారు. ఇప్పటికే బీఈడీ, లా కోర్సుల్లో ఈ పద్ధతి అమలవుతోంది. మోడరేషన్ కోసం గుంటూరు, నరసరావుపేట, తెనాలి ప్రాంతాల్లో కొత్త కేంద్రాలను ఏర్పాటు చేశారు.

News December 7, 2025

వరంగల్: సర్పంచ్‌కు పోటీ.. 9 మందిది ఒకే ఇంటి పేరు!

image

జిల్లాలోని వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి గ్రామంలో సర్పంచ్ స్థానానికి 12 మంది బరిలో ఉన్నారు. వీరిలో 9 మంది ఒకే ఇంటి పేరు గల అభ్యర్థులు ఉండడం ఓటర్లకు తలనొప్పిగా మారింది. సీనపెల్లి అనే ఇంటి పేరుతో ఉన్న అభ్యర్థులు సర్పంచ్ స్థానానికి పోటీ చేస్తుండగా, ఇందులో సీనపెల్లి రాజు అనే పేరుతో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. దీంతో ఎన్నికల పోలింగ్ సమయంలో ఎవరికి ఓట్లు పడతాయో అర్థం కానీ పరిస్థితి.