News July 2, 2024

ముఖ్యమంత్రి ఫోన్ చేసి అభిప్రాయం అడిగారు: బాలరాజు

image

పోచారం శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకునే ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు ఫోన్ చేసి అభిప్రాయం అడిగారని కాంగ్రెస్ నాయకుడు కాసుల బాలరాజు తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్నదని, పోచారం వస్తే అత్యంత బలంగా మారుతుందని, గతంలో కూడా తాను శీనన్నతో కలిసి పనిచేశాను, ఇప్పుడు కూడా కలిసి పనిచేస్తానని ముఖ్యమంత్రికి చెప్పానన్నారు.

Similar News

News December 8, 2025

నిజామాబాద్ జిల్లాలో 8.4°C అత్యల్ప ఉష్ణోగ్రత

image

నిజామాబాద్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతల వివరాలను అధికారులు వెల్లడించారు. ఆరెంజ్ అలర్ట్ జారీ అయిన ప్రదేశాల్లో కోటగిరి 8.4°C, సాలూర 8.8, చిన్న మావంది 9.1, పొతంగల్ 9.2, జకోరా 9.2, డిచ్‌పల్లి 9.7, కల్దుర్కి 9.9°C ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఎల్లో అలర్ట్‌లో గన్నారం, మోస్రా, గోపన్న పల్లి, మదన్ పల్లి, నిజామాబాద్ నార్త్ 10.1°C ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి.

News December 8, 2025

NZB: సీనియర్ నేషనల్ ఆర్చరీ టోర్నీకి టెక్నికల్ అఫీషియల్‌గా మురళీ

image

నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఖేలో ఇండియా ఆర్చరీ కోచ్ మురళీ జాతీయస్థాయి ఆర్చరీ పోటీలకు టెక్నికల్ అఫీషియల్‌గా నియమితులయ్యారు. ఈనెల 10 నుంచి 19 వరకు హైదరాబాద్‌లోని బేగంపేట HPSలో నిర్వహించనున్న 42వ సీనియర్ నేషనల్ ఆర్చరీ పోటీలకు ఆయన టెక్నికల్ ఆఫీసర్‌గా వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆర్చరీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ నియామక పత్రాన్ని విడుదల చేశారు.