News September 23, 2024

ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.కోటి విరాళం

image

వరద బాధితుల సహాయార్ధం ముఖ్యమంత్రి సహాయ నిధికి ఎంప్రెడా మైన్స్ అండ్ మినరల్స్ ఛైర్మన్ ఏఎస్ విక్రమ్ రూ.కోటి విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన సీఎం చంద్రబాబును కలిసి ఆ చెక్కును అందజేశారు. కష్టాల్లో ఉన్న వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన విక్రమ్‌ను చంద్రబాబు అభినందించి కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News October 10, 2024

ఈ నెల 14 నుంచి పల్లె పండుగ: కలెక్టర్

image

గుంటూరు జిల్లాలో ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు పల్లెపండుగ, పంచాయతీ వారోత్సవాలు నిర్వహించాలని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. బుధవారం కలెక్టరేట్ నుంచి ఆమె అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉపాధి హామీ పనుల్లో భాగంగా ఇప్పటికే మంజూరైన పనులను శంకుస్థాపనలు చేయాలన్నారు.

News October 10, 2024

గుంటూరులో జాతీయ స్థాయి పర్యవేక్షణ బృందం పర్యటన

image

కేంద్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ద్వారా అమలు చేసిన కార్యక్రమాలకు సంబంధించిన సాధారణ పర్యవేక్షణ 2024-2025 సంవత్సరానికి(దశ-1) నిర్వహించటానికి జాతీయస్థాయి పర్యవేక్షకులు బుధవారం గుంటూరు జిల్లాకు విచ్చేశారు. ప్రిన్సిపల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ సూర్యకాంత, కలెక్టర్ నాగలక్ష్మిని కలిశారు. అనంతరం కలెక్టర్, డీఆర్డీఎ ప్రాజెక్ట్ డైరెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో సమావేశమయ్యారు.

News October 10, 2024

T20 క్రికెట్ టోర్నమెంట్‌లో మంగళగిరి అమ్మాయి

image

ఈ నెల 17 నుంచి బరోడా వేదికగా జరిగే ఇండియా సీనియర్ మహిళా T20 టోర్నమెంట్‌లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ మహిళ క్రికెట్ టీంలో మంగళగిరికి చెందిన వాసవి అఖిల పావనిని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. గత నెల సెప్టెంబర్ 1 నుంచి 5 వరకు ఢిల్లీలో జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్ ఐపీఎల్ టీం సెలక్షన్ ట్రైల్‌కి హాజరయ్యారు. మంగళగిరి నుంచి ఎంపికైన మొదటి మహిళా క్రికెట్ క్రీడాకారిణి పావనికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు.