News February 25, 2025
ముఖ్రా(కె)లో చెట్లకు క్యూ ఆర్ కోడ్

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖ్రా(కె) మాజీ సర్పంచ్ గాడ్గె మీనాక్షి పర్యావరణ పరిరక్షణకు కొత్తబాట వేశారు. ‘డిజిటల్ ట్రీ ఆధార్’తో ప్రతి చెట్టును జియో-ట్యాగ్ చేయడం, క్యూఆర్ కోడ్‌లను కేటాయించారు. పర్యావరణ బాధ్యత అంటే ఇదే! ప్రతి చెట్టు ఆధార్ కార్డులతో పౌరుల వలె వృద్ధి చెందేలా ఈ విప్లవాత్మక ఆలోచనకు మద్దతు ఇద్దామని BRS మాజీ ఎంపీ సంతోశ్ కుమార్ ఎక్స్ వేదికగా పోస్టు చేసి ఆమెను అభినందించారు.
Similar News
News March 21, 2025
ఖండాలలో నీటి సమస్య లేకుండా చర్యలు: కలెక్టర్

ఆదిలాబాద్ రూరల్ మండలంలోని ఖండాలలో నీటి సమస్య తలెత్తకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. గ్రామం నుంచి 4 KM దూరంలో ఉన్న వాగు వద్ద బోర్వెల్ వేసి అక్కడి నుంచి పైపు లైన్ ద్వారా గ్రామంలోని GLSR ట్యాంకుకు నీరు సరఫరా చేస్తామన్నారు. రోజు ఉదయం 7గంటలకు, సాయంత్రం 6 గంటలకు 10,000 లీటర్ల నీటిని అందిస్తామని హామీ ఇచ్చారు.
News March 21, 2025
ఆదిలాబాద్ డైట్ కళాశాలలో ఉద్యోగాలు

ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ డైట్ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రవీందర్ రెడ్డి తెలిపారు. 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఆసక్తి అర్హత గల అభ్యర్థులు తమ బయోడేటా, ఫోటోలతో ఈ నెల 22 నుంచి 24 లోపు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అభ్యర్థులను నమూనా తరగతుల ఆధారంగా ఎంపిక చేస్తామని వెల్లడించారు.
News March 21, 2025
గుడిహత్నూర్‌లో క్లినిక్ సీజ్

గుడిహత్నూర్‌లోని ఓ క్లినిక్‌ను అధికారులు సీజ్ చేశారు. సూర్యవంశీ అనే RMP వైద్యుడు తన పరిధికి మించి ఓ గర్భం దాల్చిన బాలికకు అబార్షన్ పిల్స్ ఇచ్చారు. విషయం తెలుసుకున్న DMHO డా.నరేందర్ రాథోడ్ ఆదేశాల మేరకు అధికారులు సదరు క్లినిక్‌ను సీజ్ చేశారు. జిల్లాలో ప్రాక్టీస్ చేస్తున్న RMPలు కేవలం ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేయాలని, పరిధికి మించి వైద్యం అందిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.