News July 29, 2024
ముగిసిన ఉపాధ్యాయ పదోన్నతుల ప్రక్రియ
జిల్లాలో ఉపాధ్యాయ పదోన్నతుల ప్రక్రియ రెండో విడత కూడా ముగిసింది. గత నెల 20 వరకు ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను పూర్తిచేసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఒక్కో ఉపాధ్యాయుడు మూడు సబ్జెక్టుల్లో కూడా పదోన్నతులు పొంది ఒక్క సబ్జెక్టులోనే జాయిన్ కావడంతో మిగతా రెండు పోస్టులు ఖాళీగానే మిగిలిపోయాయి. దీంతో అధికారులు నాట్ విల్లింగ్ తో మిగిలిన పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేశారు.
Similar News
News October 8, 2024
నల్లగొండలో రేపు జాబ్ మేళా
నల్లగొండలోని ఉపాధి కల్పన కార్యాలయంలో ఈ నెల 9న ఉదయం 10.30 నుంచి 2 గంటల వరకు నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రైవేట్ కంపెనీల్లో విదేశీ ఉద్యోగాల కోసం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్.పద్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన వారికి నెలకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనాలు ఉంటాయని పేర్కొన్నారు.
News October 8, 2024
లింగాలగూడెంలో క్షుద్ర పూజలు.. భయాందోళనలో గ్రామస్థులు
మండలంలోని లింగాలగూడెం గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గ్రామానికి చెందిన బొబ్బలి నరసింహ, గన్నేబోయిన వెంకన్న ఇళ్లలో అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసిన మూటలను ఇళ్లలో పడేసి వెళ్లారు. వాటిని గమనించిన సదరు వ్యక్తులు మూటలు విప్పి చూడగా అందులో పసుపు,కుంకుమ, నిమ్మకాయలు, నవధాన్యాలు, గవ్వలు, జీడిగింజలు, తాటి ఆకు బొమ్మలు బయటపడ్డాయి.
News October 8, 2024
NLG: ఆర్టిఐ సదస్సు కరపత్రాన్ని ఆవిష్కరించిన కలెక్టర్
RTI ఆవిర్భావ దినోత్సవం సదస్సు కరపత్రాన్ని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పూర్ణచంద్రలు ఆవిష్కరించారు. సోమవారం నల్గొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో కరపత్రం ఆవిష్కరించించి సమాచార హక్కు పరిరక్షణ సమితి జాతీయ చైర్మన్ డా.బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో దుశ్యర్ల సత్యనారాయణ, సైదులు, మేఖల శ్రీహరి, కాడబోయిన సాయి, మల్లయ్య, శంకర్, రాంబాబు పాల్గొన్నారు.