News February 23, 2025
ముగిసిన ఎపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు

ఆదివారం జరిగిన ఎపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ డా.వెంకటేశ్వర్ ఎస్ తెలిపారు. తిరుపతిలో నిర్వహించిన 13 పరీక్షా కేంద్రాలలో ఈ పరీక్షలకు 5801 మంది అభ్యర్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా ఉదయం పేపర్ 1 పరీక్షకు 5055 మంది హాజరు కాగా 87.14 శాతంగా, మధ్యాహ్నం పేపర్-2 పరీక్షకు 5046 మంది హాజరు కాగా 86.99 శాతం మంది పరీక్షకు హాజరయ్యారని తెలిపారు.
Similar News
News February 24, 2025
అధైర్య పడొద్దు.. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం: ఎమ్మెల్యే బొజ్జు

ఉట్నూర్ మండలం లక్షటిపేటకు చెందిన ఉప్పు నర్సయ్య ఇండ్లు ప్రమాదవశాత్తు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యి సర్వం కోల్పోయారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఆదివారం బాధిత కుటుంబానికి పరామర్శించారు. ప్రమాదం జరగడానికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. నర్సయ్య కుటుంబాన్ని ప్రభుత్వపరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా కల్పించారు. ఆధైర్యపడవద్దని త్వరలో ఇందిరమ్మ ఇళ్ల ఇస్తామన్నారు.
News February 24, 2025
BHPL: నేటి ప్రజావాణి కార్యక్రమం రద్దు: కలెక్టర్

నేడు జరుగనున్న ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. జిల్లాలో శాసన మండలి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, జిల్లా యంత్రాంగం ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నందున ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రజావాణి కార్యక్రమం తాత్కాలిక రద్దును ప్రజలు గమనించాలని ఆయన సూచించారు.
News February 24, 2025
స్టేషన్ ఘనపూర్: యువత సరైన మార్గంలో ప్రయాణించాలి: ఎంపీ కావ్య

యువత సరైన మార్గంలో ప్రయాణించి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. ఇప్పగూడెం గ్రామానికి చెందిన యువత క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న సందర్భంగా ఎంపీని కలిశారు. యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని, యువత తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు.