News May 3, 2024

ముగిసిన ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు: డీఈఓ

image

గత నెల 25 నుంచి ప్రారంభమైన ఓపెన్ పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు గురువారంతో ముగిశాయి. భద్రాద్రి జిల్లాలో పదో తరగతి అభ్యర్థులకు మూడు సెంటర్లు, ఇంటర్ అభ్యర్థులకు నాలుగు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా, పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఓపెన్ ఇంటర్మీడియట్ జనరల్, ఒకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలు నేటి నుంచి 10వ తేదీ వరకు జరుగుతాయని డీఈఓ వెంకటేశ్వరచారి తెలిపారు.

Similar News

News November 18, 2025

ఖమ్మం: సీతారామ పథకానికి అత్యధిక పరిహారం: అ. కలెక్టర్

image

సీతారామ ఎత్తిపోతల పథకం భూసేకరణపై సోమవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి రైతులతో చర్చించారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం బాజుమల్లాయిగూడెం రైతులకు ఎకరాకు ₹11.44 లక్షలు, రేలకాయపల్లికి ₹12.40 లక్షలు చెల్లించాలని నిర్ణయించారు. భూముల ధరలు వార్షికంగా పెరిగే అంశాన్ని పరిగణనలోకి తీసుకుని, బాజుమల్లాయిగూడెం రైతులకు ₹15 లక్షలు, రేలకాయపల్లి రైతులకు ₹16 లక్షల పరిహారం అందిస్తామని ఆయన తెలిపారు.

‘ప్రాధాన్యత కార్యక్రమాల అమలుపై అధికారులు దృష్టి సారించాలి’

image

ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలుపై మండల ప్రత్యేక అధికారులు దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి అనంతరం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. మండల ప్రత్యేక అధికారులు ప్రతి శుక్రవారం చేపట్టిన తనిఖీలకు సంబంధించిన అంశాలపై ఆమె మరో అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డితో కలిసి సమీక్షించారు.